Mediation should be first step to settle disputes: CJI NV Ramana మధ్యవర్తిత్వంతో అనేక సమస్యలకు పరిష్కారం: సీజేఐ ఎన్వీ రమణ

Courts should be last resort for dispute resolution cji n v ramana

N V Ramana, Supreme Court CJI N V Ramana, N V Ramana on mediation, njiai, Kiren Rijiju, National Judicial Infrastructure Authority, CJI

The Supreme Court Chief Justice NV Ramana said that mediation can solve many problems without approaching the courts. Addressing the Curtain Raiser and Stakeholders' Conclave of the International Arbitration and Mediation Centre, he said that a lot of problems can be solved with the help of mediation within a short time and added that approaching courts should be the last step to solve the problems.

మధ్యవర్తిత్వంతో అనేక సమస్యలకు పరిష్కారం: సీజేఐ ఎన్వీ రమణ

Posted: 12/04/2021 08:11 PM IST
Courts should be last resort for dispute resolution cji n v ramana

మధ్యవర్తిత్వం వల్ల పెద్ద సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వం విఫలమైతే చిన్న సమస్యలు కూడా ఇబ్బందలు పెడతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కోర్టుల వరకు కేసులు రావడం అన్నది చివరాఖరి ప్రయత్నం మాత్రమే కావాలని ఆయన తెలిపారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్-మీడియేషన్ సెంటర్ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక కేసుల్లో మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించారు.

మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు రాయబారం వహించాడని, కానీ ఆయన మధ్యవర్తిత్వం విఫలమైందని తెలిపారు. దాని ఫలితంగా ఎంతటి తీవ్ర పర్యవసానాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందేనని సీజేఐ ఎన్వీ రమణ వివరించారు. సాధారణ సమస్యలు సైతం ఇగోలు, పట్టింపులు, భేదాభిప్రాయాల వల్ల జటిలం అవుతుంటాయని, మధ్యవర్తిత్వం వల్ల ఇలాంటి కేసులు సులువుగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

న్యాయ వ్యవస్థల్లో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, ఏదైనా అంశంలో చివరి ప్రయత్నంగానే కోర్టుకు వస్తే బాగుంటుందన్నది తన అనుభవంతో చెబుతున్నానని వెల్లడించారు. కోర్టు విచారణల కారణంగా అనేక సంవత్సరాల సమయం వృథా అవుతుందని రమణ వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందని, సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు.కాగా, లండన్, హాంకాంగ్, సింగపూర్, పారిస్ నగరాల్లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయని, ఆ తరహాలో హైదరాబాదులోనూ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles