RPF man saves elder woman after she falls off moving train వృద్ద మహిళను కాపాడిన రైల్వే పోలీసు

Rpf staffer saves woman passenger from falling under moving train at kalyan station

moving train, rpf constable, woman fallen from train, woman boarding a running train, rpf constable Kalyan railway station, rpf woman constable saves old woman, constable saves old woman passenger, rpf constable saves elder woman, constable saves old woman falling under train, rpf constable saves life, Railway station, woman passenger, Kalyan railway station, running train, RPF constable, CCTV footage, Netizens, viral video, Crime

In yet another incident, an alert RPF staffer saved the life of a 72-year old lady passenger when she slipped on the platform from moving train CSMT-Chennai mail express train at Kalyan railway station. The Kalyan RPF constable Updesh Yadav said the incident took place on Monday at 1.55 pm at platform number 4 when a lady passenger Sarubai Karsude, resident of Pune, was trying to board a moving train when she lost balance and fell in the gap between the train and platform.

ITEMVIDEOS: పట్టాలపై పడకుండా వృద్ద మహిళను కాపాడిన రైల్వే పోలీసు

Posted: 11/30/2021 11:09 AM IST
Rpf staffer saves woman passenger from falling under moving train at kalyan station

ఒక్కోసారి క్షణకాలంలో జీవితం మొత్తం మన కళ్ల ముందు కనిపిస్తుంది. పెద్ద అపద నుంచి తప్పించుకున్నప్పుడు.. లేదా ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయట పడినప్పుడు హమ్మయ్య అనుకోవడం పక్కనబెడితే.. అమ్మో కొద్దిలో మరణపు అంచుల వరకు వెళ్లివచ్చామన్న ఫీలింగే ఎక్కువగా అనిపిస్తోంది. మహారాష్ట్రలోని ఫూణే సమీపంలోగల కళ్యాణ్ రైల్వేస్టేష‌న్ లోనూ ఓ 72 ఏళ్ల వృద్ద మహిళకు కూడా అదే అనుభవం ఎదురైంది. కదులుతున్న రైలు.. వేగాన్ని అందుకుంటున్న సమయంలో దానిని ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వృద్ద మహిళ.. అనుకోకుండా అదుపుతప్పి ఫ్లాట్ ఫామ్ పై పడింది. ఈ ఘటనలో అమె పైప్రాణాలు పైనే పోయాయి. అంతే అమెకు ఒక్కసారి తన జీవితం మొత్తం కళ్లఎదుట సాక్ష్యాత్కారమైంది.

ఆమె రైలు ఎక్కడాన్ని గమనించి.. కిందపడిన అమెను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమైన రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అమెను చటక్కున పక్కకులాగి రైలు కింద పడనీయకుండా చేశాడు. మరో విధంగా చెప్పాలంటే అమె ప్రాణలతో సురక్షితంగా ఉందంటే.. కానిస్టేబుల్ కాపాడటం వల్లే. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటా 55 నిమిషాలకు కళ్యాణ్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫామ్ నెంబరు 4లో చెన్నై మెయిల్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్దంగా వుంది. అదే సమయంలో ఫూణేకు చెందిన సురభి ఖర్ సుడే ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదలడంలో అదుపుతప్పి రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్యనున్న గ్యాప్ లో పడిపోయింది.

ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైలు ఎక్కుతున్నారా..? లేదా అని పర్యవేక్షిస్తూ అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉప్ దేశ్ యాదవ్ వెంటనే అప్రమత్తమై పరుగుపరుగు వెళ్లి అమెను బయటకు లాగారు. రైలు కదులుతున్న క్రమంలో అందులోకి ఎక్కాలని ప్రయత్నం చేయడంతో అమె అదుపుతప్పి పడిపోయింది. అమె అప్రమత్తంగా వున్న కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ వెంటనే అమెను బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం రెండూ ప్రమాదకరమేనని ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు మరోమారు సూచించారు.

ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవి దృశ్యాలను రైల్వేశాఖ తమ సామాజిక మాద్యమాల్లో పెట్టింది. దీంతో వృద్ద ప్ర‌యాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ పై నెటిజనులు ప్రశంసలు కురుస్తున్నాయి. రద్దీగా వుంటే కళ్యాణ్ రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా సిబ్బంది బృందాలు ఎంతో అప్రమత్తంగా వుంటాయని ఉపదేశ్ యాదవ్ మరోమారు నిరూపించాడు. కానిస్టేబుల్ ఉపదేశ్ యాదవ్ పై రైల్వే ఉన్న‌తాధికారులు, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో పాటు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడీయోను నెట్టింట్లో అప్ లోడ్ చేసిన పోలీసులు.. క్షణకాలం తొందరతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh