HC quashes order converting Jaya’s residence as memorial జయలలిత ‘వేద నిలయం’ దీపా, దీపక్ లకు అప్పగించండీ: హైకోర్టు

Jayalalithaa s poes garden house to behanded over to deepa deepak madras hc

Veda Nilayam news, Veda Nilayam memorial, Jayalalithaa, Jayalaithaa residence, J Jayalalithaa, Ved Nilayam, Poes Garden residence, Chennai, Poes Garden, Jayalalitha home, Jaya home chennai, Deepa, Deepak, AIADMK, Panneerselvam, EPS, Madras HC, Madras court, Madras news, Chennai news, E Palaniswami, Madras High Court, Madras HC, Madras, Tamil Nadu, Politics

After a long legal battle, the Madras High Court on Wednesday, November 24, cancelled the acquisition of former Tamil Nadu CM J Jayalalithaa's Veda Nilayam residence in Chennai’s Poes Garden. The Madras High Court has now transferred the ownership of the Poes Garden residence to Jayalalithaa’s niece Deepa and nephew Deepak.

జయలలిత ‘వేద నిలయం’ దీపా, దీపక్ లకు అప్పగించండీ: హైకోర్టు

Posted: 11/24/2021 08:27 PM IST
Jayalalithaa s poes garden house to behanded over to deepa deepak madras hc

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్ ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు..  మూడు వారాల్లో పోయెస్‌ గార్డెన్ ని జయలలిత మేన కోడలి దీప, మేనల్లుడు దీపక్ లకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  

జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన తరువాత అమెకు చెందిన ఇళ్లు పోయిస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని ఆమె స్మృతులకు చిహ్నంగా స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే బాధ్యత, హక్కు పార్టీకి ఉన్నదని తెలిపింది. ఇది తమిళనాడు ప్రజలు, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల ‘పూర్తి హృదయపూర్వక కోరిక’ అని అన్నాడీఎంకే అప్పట్లో పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

జయలలిత మరణించిన కొన్ని నెలల తర్వాత 2017లో ఏఐఏడీఎంకేలోని రెండు వర్గాల విలీనానికి ముందస్తు షరతుల్లో ఇది కూడా ఒకటి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇ పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. 0.55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి గత ఏడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వం రూ.67.9 కోట్లను సిటీ కోర్టులో డిపాజిట్ చేసింది. కాగా తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్‌ గార్డెన్‌ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles