poisonous black cobra drinking water from a glass వైరల్ వీడియో: గాజు గ్లాసులోంచి నీళ్లను తాగేస్తున్న బ్లాక్ కోబ్రా

Viral video poisonous black cobra drinks water from glass internet is intrigued

Naag video, kaala naag, snake video, viral video, trending video, cobra, naag, Water, Cobra video, viral video, Viral Story, snake video, Black-necked spitting cobra, royal_pythons#snakelovers #snakesofinstagram #snake

Thanks to social media, we often come across wonderful pictures and videos of animals, which leave us in awe. For instance, snake videos always generate fear but at the same time, it’s quite fascinating to watch these majestic creatures. One such video has gone viral on social media showing a black-necked spitting cobra drinking water from a glass.

ITEMVIDEOS: అయ్యో పాపం: గాజు గ్లాసులోంచి నీళ్లను తాగేస్తున్న బ్లాక్ కోబ్రా

Posted: 11/24/2021 04:32 PM IST
Viral video poisonous black cobra drinks water from glass internet is intrigued

పాము పేరు వినగానే చాలా మంది భయకంపితులవుతారు. అది విషపూరితమైన పామా.? లేక విషపూరితం కానిదా.? అన్న అలోచన కూడా చేయరు. పాము అన్న పదమే సామాన్యులను అప్రమత్తం చేస్తోంది.  అనుకోకుండా ఒక బ్లాక్ కోబ్రాను ఎదురుపడితే ఇంకేముందీ.. పైప్రాణాలు పైనే గాల్లో కలిసిపోతాయి. అయితే వెంటనే తేరుకుని దాని నుండి తప్పించుకోవడానికి.. పరుగు పెడతాం. కాగా తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక బ్లాక్ కోబ్రాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది, అందులో ఒక వ్యక్తి ప్రమాదకరమైన బ్లాక్ నెక్ స్పిట్టింగ్ కోబ్రాకు గ్లాస్‌లో నీరు త్రాగడాన్ని మీరు చూడవచ్చు. ఆశ్చర్యం గోలుపుతున్న ఈ వీడియో చూసిన తర్వాత అయ్యో పాపం ఈ బ్లాక్ కోబ్రాకు ఎంత దాహం వేసిందో అని కామెంట్ చేస్తారేమో మరీ..

బ్లాక్ కోబ్రా గాజు గ్లాసులో వేడినీరు

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చెక్క బోర్డు మీదుగా వచ్చిన ఓ నల్లత్రాచు నెమ్మదిగా అటు ఇటూ చూస్తోంది. అయితే తన చేతికి గ్లవ్ వేసుకున్న ఒక వ్యక్తి గాజు గ్లాసు నిండా నీళ్లను పట్టుకుని ఉన్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో, నల్ల నాగుపాము అతనికి చాలా దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుంది. క్షణాల్లో తన శత్రువుపై దాడిని చేసే ఈ నల్లని త్రాచు ఆ వ్యక్తి తన చేత్ో గాజు గ్లాసు నిండా నీళ్లను దగ్గరగా తీసుకువెళ్తుండగా గమనించి తీక్షణంగా చూస్తుందే కానీ దాడి చేయడం లేదు. దీంతో ఆ వ్యక్తి.. నీళ్లుతో నిండిన గాజు గాస్లును దాని వద్దకు తీసుకువస్తాడు. దీంతో పాము ఏంచక్కా గాజు గ్లాసులోని నీళ్లను తాగేస్తూ తన దాహాన్ని తీర్చుకుంటోంది.

మిశ్రమంగా స్పందించిన నెటిజనులు

ఈ వీడియో చూసి చాలావరకు నెట్టిజనులు తమ ఆశ్చర్యన్ని వ్యక్తం చేశారు. అయితే కోందరు మాత్రం విభిన్నంగా స్పందించారు. వీరికి ఈ వీడియో ఆశ్చర్యం కలిగించకపోగా, మరికొందరు విచిత్రంగా స్పందించారు. ఈ ప్రత్యేకమైన బ్లాక్ కోబ్రా వీడియో రాయల్ పైతాన్స్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. 'ఇది అద్భుతమైన దృశ్యం. దాహంతో ఉన్న నాగుపాము నీళ్లు తాగుతోంది’’ అని వీడియో క్యాప్షన్ ఇచ్చింది. వారం రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 22 వేల మందికి పైగా వీక్షించారు మరియు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Royal Pythons (@royal_pythons_)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles