Netizens divided over street vendor's amazing skill ఓ వైపు దుకాణం.. మరోవైపు కస్టమర్లు.. వడ్డన స్టైలే వేరు

Street vendor tosses food from wok to man across street in viral video

street vendor, food, wok, tossing food, social media, instagram, twitter, street vendor skills, viral video, Trending video, India News

Internet is filled with videos showcasing the amazing talents of street food vendors. In one such recent video, another skilled street vendor has gone viral on social media platforms including, Twitter and Instagram. In the video, the street vendor can be seen tossing food from a wok to a man standing several metres away on the other side of the road perfectly.

ITEMVIDEOS: వైరల్ వీడియో: ఓ వైపు దుకాణం.. మరోవైపు కస్టమర్లు.. వడ్డన స్టైలే వేరు

Posted: 11/24/2021 01:47 PM IST
Street vendor tosses food from wok to man across street in viral video

వీధి వ్యాపారస్థుల అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియోలతో ఇంటర్నెట్ నిండి ఉంది. 'సూపర్ సోనిక్‌ స్పీడ్‌'లో దోసెలు తయారు చేయడం నుండి కాగుతున్న నూనె నుండి చికెన్‌ పకోరాలను ఒట్టి చేతులతో తీయడం వరకు, ఒక్కొక్కటి వాటి స్వంత వినోద విలువలతో కూడినమే. ఇవి వేటికవే ప్రత్యేకమైనవి కూడా అని చెప్పందుకు సందేహమే అవసరం లేదు. ఈ కోవకు చెందిన తాజా వీడియోలలో, వీధి విక్రేతలకు సంబంధించిన మరో నైపుణ్యం కలిగిన వీడియో తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అటు ట్విట్టర్ సహా ఇటు ఇన్ స్టాగ్రామ్ లోనూ వైరల్ గా మారాయి.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసా.. వీధి వ్యాపారి తాను వండిన ఆహారాన్ని రోడ్డుకు అవతలి వైపు చాలా మీటర్ల దూరంలో నిలబడి ఉన్న వ్యక్తికి నేరుగా తన కడాయి నుంచి విసిరివేయడం కనిపిస్తోంది. దానిని అంతే నేర్పుగా రోడ్డుకు అవతలి వైపు వున్న వ్యక్తి.. ఓ ప్లేట్ లాంటి దాంతో పట్టుకుని.. తనవైపున కూర్చున్న కస్టమర్లకు అందజేయడం కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుకు ఒకవైపు గ్యాస్ స్టవ్‌పై బీన్స్ వండే వ్యక్తి తన బాణీలో అహారాన్ని వండించిన తరువాత.. మంటను తగ్గించి, గుడ్డతో బాణిని తీయడం కనిపిస్తుంది. తదనంతరం, అతను వండిన బీన్స్‌ను తన తలపై నుంచి రోడ్డుకు అవతలి వైవు నిల్చుకున్న వ్యక్తికి విసురుతాడు. అవతలి వ్యక్తి దానిని అంతే జాగ్రత్తా పట్టుకుని తన వైపునున్న కస్టమర్లకు అందిస్తున్నాడు.

ఇన్ స్టాగ్రామ్ లో గతవారం రోజుల కిత్రం షేర్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. అయితే వీధి వ్యాపారి ప్రతిభను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు కురిపించారు. ఇక నెటిజన్లు నుంచి ఈ వీడియో మిశ్రమ స్పందనలను ఎదుర్కోంది. కొందరు ఈ వీడియోను "ఇది అద్భుతంగా ఉంది ... దీనిని ఫ్లయింగ్ ఫుడ్ అంటారు" అని.."వావ్ అతను అద్భుతంగా వంటను చేసి వడ్డించాడు" అని మరొకరు కామెంట్ చేయగా, ఇలా చాలా సమయం గాల్లో అహారం వుంటే కరోనా వస్తుందేమోనని మరోకరు పోస్టు చేశారు. కాగా ఇంకోందరు నెట్టిజనులు మాత్రం ఇందులో వింతేమీ లేదని కొట్టిపారేశారు. మరి కొంతమంది మాత్రం ఆహారాన్ని అగౌరవపరిచారని విక్రేతను విమర్శించారు. "ఆహారాన్ని విసిరేయకూడదని.. చిన్నప్పటి నుంచి వింటున్నాము.. అయినా ఆయన విసిరేస్తున్నాడు. ఇది పద్దతి కాదు" అని మరోకరు కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles