Low Pressure likely over Bay of Bengal బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 27 వరకు వర్షాలు

Low pressure over bay of bengal with intensification rain forecast to tn andhra

Hyderabad rain, Hyderabad rain today, telangana rain, telangana rain updates, telangana rain alert, IMD weather alert, imd, imd alert, imd bulletin, imd forecast, telangana floods, Hyderabad rains, bay of bengal, low pressure over bay of bengal, low pressure area, moderate rain, light to moderate rainfall in Telangana, weather update telangana, Hyderabad weather, IMD, Predictions, chittor, nellore, Andhra Pradesh, Telangana, Tamil Nadu

A fresh low pressure area may form over the equatorial Indian ocean and adjoining south Andaman Sea between November 26 and December 2, the India Meteorological Department (IMD) said. Several weather models are indicating the formation of the system with intensification into a higher category system over southeast Bay of Bengal and neighbourhood towards the end of the forecasted period of time.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 27 వరకు వర్షాలు

Posted: 11/23/2021 04:44 PM IST
Low pressure over bay of bengal with intensification rain forecast to tn andhra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి అంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తమిళనాడులోనూ వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్నిదశాబ్దాలుగా లేని వరుణ బీభత్సాన్ని చిత్తూరు, నెల్లూరు ప్రజలు చవిచూశారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే మగ్గుతుండగా, మరో చేధువార్తను అందించింది భారత వాతావరణ కేంద్రం.  రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని తెలిపింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షం కురిసిందని, అత్యధికంగా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యూ), ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ 5, వికారాబాద్‌ జిల్లా దోమ 3, నిర్మల్‌ జిల్లా సారంగపూర్ణ, కొమ్రంబీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌, ఖమ్మం జిల్లా సతుపల్లిలో రెండు సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వివరించింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత సంగారెడ్డి కోహిర్‌లో 19.1, జీహెచ్‌ఎంసీ పరిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 19.4 డిగ్రీలు.. అత్యధికంగా ఖమ్మం పట్టణంలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ డీపీఎస్‌ పేర్కొన్నింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles