Galwan hero Col Santosh Babu gets Mahavir Chakra కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర అవార్డు ప్రధానం

Hero colonel santosh babu accorded mahavir chakra posthumously

Santosh Babu, Colonel Santosh Babu, Santosh Babu Maha Vir Chakra, Santosh Babu MVC, Galwan martyrs, Naib Subedar Nuduram Soren, Havildar K Palani, Naik Deepak Singh, Sepoy Gurtej Singh, Galwan clash, Maha Vir Chakra, Galwan martyrs, Chinese Army, Face-off, President, Ram Nath Kovind, Rashtrapati Bhavan, Delhi

Colonel Santosh Babu, who laid down his life while resisting a vicious attack on his observation post by Chinese Army soldiers in the Galwan valley of Ladakh, was awarded Maha Vir Chakra (posthumously) by President Ram Nath Kovind at a defence investiture ceremony at the Rashtrapati Bhavan on Tuesday. His mother and wife received the award from President.

కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర అవార్డు ప్రధానం

Posted: 11/23/2021 03:43 PM IST
Hero colonel santosh babu accorded mahavir chakra posthumously

తెలంగాణకు చెందిన అమరవీరుడు కర్నల్ సంతోష్ బాబును కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఆయన దేశానికి చేసిన సేవలతో పాటు శత్రుమూకలతో ఆయన వ్యవహరించిన తీరును పరగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆయన మరణానంతర అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇవాళ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన భార్య సంతోషి, తల్లి అవార్డును అందుకున్నారు.

‘‘ఆపరేషన్ స్నో లియోపార్డ్ లో భాగంగా 16 బీహార్ రెజిమెంట్ కు నాయకత్వం వహిస్తున్న కర్నల్ బికుమళ్ల సంతోష్ బాబు గల్వాన్ లోయలో శత్రువుతో పోరాడి అమరుడయ్యారు. అప్పగించిన పనిని ఆయన విజయవంతంగా చేశారు. తన బలగాలను సిద్ధం చేశారు. వైరి దేశ సైనికులతో జరిగిన ఫేసాఫ్ లో వారిని ధీటుగా అడ్డుకున్నారు. రాళ్ల దాడులు, మారణాయుధాలతో విరుచుకుపడిన శత్రు మూకలను ఎదురొడ్డి అడ్డగించారు. ఆ క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయినా వారితో పోరాడారు. తుది శ్వాస వరకు ముందుండి తన బృందాన్ని నడిపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసా పత్రంలో పేర్కోన్నారు.

ఆయన ప్రధర్శించిన ధైర్య సాహసాలు ఆయన బృందాన్నికి కొండంత అండనిచ్చాయి. రక్తమోడుతున్నా ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు’’ అని అవార్డుతో పాటు ఇచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. కాగా, నాయబ్ సుబేదార్ నుదురాం సోరెన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయ్ గుర్తేజ్ సింగ్ లకు వీరచక్ర అవార్డును అందించనున్నారు. గత ఏడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ సైనికులను సంతోష్ బాబు టీం నిలువరించింది. ఆ క్రమంలో సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles