Rakesh Tikait takes jibe at Owaisi-BJP bond మజ్లీస్-బీజేపి అనుబంధంపై రాకేశ్ తికాయత్ వ్యంగాస్త్రాలు

Rakesh tikait calls bjp owaisi chacha bhatija over demand to repeal caa

Citizenship (Amendment) Act, National Register of Citizens, Assaduddin Owaisi, AIMIM, BJP, Relation-ship, chacha-bhatija, Bond, BJU, Rakesh TIKait, CAA, NRC, farm laws repeal, Crime

Farmers' leader Rakesh Tikait, said that AIMIM chief Assaduddin Owaisi and the Bharatiya Janata Party “share a bond of 'chacha-bhatija' (uncle-nephew)”. Bharatiya Kisan Union leader Rakesh Tikait was reacting to All India Majlis-e-Ittehadul Muslimeen chief Asaduddin Owaisi's demand to repeal the Citizenship (Amendment) Act, 2019, and the National Register of Citizens.

మజ్లీస్-బీజేపిల మధ్య ‘‘మామా-అలుళ్ల’’ సంబంధం: రాకేశ్ తికాయత్ వ్యంగాస్త్రాలు

Posted: 11/22/2021 06:13 PM IST
Rakesh tikait calls bjp owaisi chacha bhatija over demand to repeal caa

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్‌ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్‌, బీజేపీ పార్టీ మామా-మేనల్లుడి బంధమని విమర్శించారు. పౌరసత్వ (సవరణ) చట్టం -2019, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) రద్దుపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాకేశ్‌ తికాయిత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒవైసీ తనకు ఏది కావాలన్నా బీజేపీని నేరుగా అడుగవచ్చు. దీని గురించి ఆయన టీవీలో మాట్లాడకూడదు. ఆయన నేరుగా అడగొచ్చు’ అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు చట్టాలను రద్దు చేయకపోతే నిరసన కారులు వీధులను షాహీన్‌బాగ్‌గా మారుస్తారని హెచ్చరించారు. సీఏఏ రాజ్యాంగానికి విరుద్ధమని, బీజేపీ ప్రభుత్వం రెండు చట్టాలను రద్దు చేయాలన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా వందలాది మంది ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ విధించిన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఇదిలా ఉండగా.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో వంద స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakesh TIKait  BJU  aimim  asaduddin owaisi  caa  nrc  farm laws  repeal  BJP  chacha-bhatija  crime  

Other Articles