పాము అన్న పదం వింటే చాలు మనలో చాలా మంది పావు కిలోమీటరు దూరం పరుగెడతారు. అయితే ఈ పాములు మనుషలు తమ వద్దకు చేరితే హాని చేకూరుస్తాయని కాటు వేస్తాయే తప్ప.. మనుషులపై పగబట్టి మాత్రం కాదు. పాముల్లో రెండు రకాలున్న విషయం కూడా తెలిసిందే. ఒకటి విషరహిత పాము మరోకటి విషపూరిత పాము. ఇక ఈ విషపూరిత పాముల్లోనూ నల్లత్రాచుపాము విషయం అత్యంత భయంకరమైనది. ఈ పాము కాటు వేసిన వెనువెంటనే ప్రాథమిక చికిత్సలు చేస్తే తప్ప.. మనుషులు బతకడం చాలా కష్టం.. అందుకనే దీనినే కింగ్ కోబ్రా అని కూడా పిలుస్తుంటారు. లాంటి నల్లత్రాచు తారసపడితే ఏమైనా వుందా.? పైప్రాణాలు పైనుంచే ఎగిరిపోవడం ఖాయం.
అలాంటిది ఒకే చోట.. అది కూడా ఏకంగా నల్ల తాచు కనిపిస్తే ఇంకేమైనా ఉందా… ఒక్క నిమిషం పాటు భయంతో గుండె ఆగిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహారాష్ట్రలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఒక చెట్టు మొదలుకు మూడు నల్ల తాచులు పెనవేసుకుని.. పడగవిప్పి మరీ ఫోటోకు ఫోజుచ్చాయి. తొలుత ఈ ఫోటో ఇండియన్ వైల్డ్ లైఫ్‌లో మంగళవారం కనిపించింది. జనావాసంలోకి ప్రవేశించిన ఈ పాములను పట్టుకుని అడవిలో వదిలేసే సమయంలో ఈ ఫోటోని క్లిక్‌మనిపించారు.
అమరావతి హరిసాల్ అటవీ ప్రాంతంలో తీసిన ఈ ఫోటోలను రాజేంద్ర సెమాల్కర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హరిసాల్ అటవి ప్రాంతంలో దర్శనమిచ్చిన మూడు తాచులు అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇప్పటి వరకు 4700 మందికి పైగా యూజర్లు దీన్ని లైక్ చేశారు. రాజేంద్ర సెమాల్కర్ షేర్ చేసిన ఫోటోల్లో ఒకటి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫోటో. దీన్ని సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజనులు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Blessings...
— Susanta Nanda IFS (@susantananda3) November 16, 2021
When three cobras bless you at the same time.
Rajendra Semalkar. pic.twitter.com/EZCQTumTwT
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more