ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా జైభీమ్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అనగారిన వర్గాలను పోలీసులు ఏ విధంగా తమకు పరిష్కారం లభించని కేసులో దోషులుగా చేరుస్తారో ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపుతోంది. వారు నేరాన్ని అంగీకరించేలా ఎలాంటి టార్చర్ పెడతారో కూడా ఈ సినిమాలో చూపించారు. అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేసి పోలీసులు పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు అమాయకులు నేరాలను అంగీకరిస్తుండగా, మరికోందరు మాత్రం పరువు ప్రతీష్టలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి.
తాజాగా సూర్యాపేట జిల్లా రామోజీ తండాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆత్మకూరు మండలం ఏపూరులో నాలుగురోజుల క్రితం ఓ చోరీ జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా.. నవీన్ అనే వ్యక్తి కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్ లో విచారించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ బాగా కొట్టినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారిలో ఓ రైతు ఉన్నాడు. అతడే ధరావత్ వీరశేఖర్. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడి పరిస్థితి చూసిన తండా వాసులంతా స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
తాను ఏ తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లారని.. బాగా కొట్టారని.. ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పలేదని వాపోయాడు వీరశేఖర్. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలోని పెండ్రీ పోలిస్ విధానం ఏర్పాటు చేశామని గొప్పులు చెప్పుకునే ప్రభుత్వం.. ఆ ఫ్రెండ్లీ విధానం ఎవరికి సోంతమని ప్రశ్నించారు.
ఈ క్రమంలో ‘‘టీఆర్ఎస్ నికృష్టపు పాలనలో మానవహక్కులు ఉరికొయ్యకు వేలాడుతున్నాయి. నిన్న మరియమ్మ, శీలం రంగయ్యల ప్రాణాలను ఖాకీలు తోడేశారు. ఇదేం దారుణం అని హైకోర్టు కన్నెర్ర చేస్తున్న సమయంలోనే వీరశేఖర్ పై అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా..?’’ అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. రేవంత్ పోస్టుపై నెటిజనుల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసులు కూడా గులాబి నేతలతో ఒకలా, సామాన్యులతో మరోలా వ్యవహరిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more