Woman throws hot soup on restaurant manager’s face సూప్ లో ప్లాస్టిక్: మేనేజర్ ముఖాన పోసిన కస్టమర్

Angry woman throws hot soup at hotel manager s face video goes viral

Texas, soup in face, throws soup, hot soup, soup nurse, menudo soup, hot soup melted lid, soup temple texas, soup freak out, bad customer, karen, arrested, CCTV Footage, viral video, Angry Woman, soup, Hotel Manager, Face, Texas, Mexican, restaurant, US, America, Crime

A woman from the US had a very extreme reaction to finding a foreign material in her food. An unnamed customer was reportedly angry after discovering melted plastic in a takeout container filled with a spicy soup from Mexican restaurant chain Sol de Jalisco in Temple, Texas, and so confronted the branch’s manager, 24-year-old Jannelle Broland. The video of this entire incident has gone viral.

ITEMVIDEOS: సూప్ లో ప్లాస్టిక్: మేనేజర్ ముఖాన పోసిన కస్టమర్

Posted: 11/11/2021 07:08 PM IST
Angry woman throws hot soup at hotel manager s face video goes viral

తినే అన్నంలో బల్లి ఆనవాళ్లు ఉంటే.. ఏంచేస్తాం.. లేదా ఇడ్లీ సాంబారులో బొద్దింక వుంటే ఏం చేస్తాం.. మన దేశంలో మాత్రం ఆ ఆహారాన్ని పక్కనబెట్టి.. హోటల్ సర్వర్ పై కేకలేసి.. మేనేజరుకో లేక హోటల్ ఓనరుకో పిర్యాదు చేస్తాం. లేదు కాసింత అవగాహన వున్నవాళ్లు అయితే వాటి ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట్లో పెడతారు. ఇక చట్టప్రకరం చర్యలు తీసుకునేలా చేసేందుకు మరికోందరు ఏకంగా సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిలచి పిర్యాదు చేస్తారు. అయితే మేనేజరుకు పిర్యాదు చేసే క్రమంలో వారు కూడా సరిగ్గా స్పందించని పక్షంలో ఇలాంటి చర్యలకు పూనుకుంటాం.

అయితే ఏకంగా మేనేజర్ ముఖంపై వేడి వేడి ఆహార పధార్థాన్ని వేసేసి వెళ్లిపోం. అలా చేసినా.. వారికేమైందోనన్న మానవత్వంలోనైనా అక్కడే వుండి వారికి సారి చెబుతాం. కానీ ఓ మహిళ మాత్రం వేడి వేడి సూప్ హోటల్ మేనేజర్ పై పోసేసి.. రెస్టారెంటు నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ లోని టెంపుల్ నగరంలో జరిగింది. అక్కడి మెక్సికన్ చైయిన్ రెస్టారెండు సోల్ డి జలిస్ కో రెస్టారెంటుకు వ‌చ్చి ఓ కస్టమర్ సూప్ ఆర్డ‌ర్ చేసింది ఓ మ‌హిళ‌. అయితే, అది బాగోలేద‌ని, స‌ర్వీస్ చేసేది ఇలాగేనా? అంటూ వేడివేడి సూప్‌ను రెస్టారెంటు మేనేజ‌ర్‌పై పోసేసి, వెళ్లిపోయింది.

చివ‌ర‌కు ఆ క‌స్ట‌మ‌ర్ కారు నంబ‌రును గుర్తించిన హోటల్ సిబ్బంది దానిని ఫోటోలలు తీసి.. మేనేజ‌ర్ కు అందించగా అమె సదరు కస్టమర్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచారణ జ‌రుపుతున్నారు. మేనేజ‌ర్ పై క‌స్ట‌మ‌ర్ సూప్ పోసిన‌ దృశ్యాలు రెస్టారెంటులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల రెస్టారెంటుకు వ‌చ్చిన ఓ కస్టమర్‌ స్పైసీ మెక్సికన్‌ సూప్‌ ఆర్డర్ చేయ‌గా, ఆమెకు రెస్టారెంటు సిబ్బంది సర్వ్‌ చేసిన సూప్‌ కంటైనర్‌లో ప్లాస్టిక్‌ ముక్కలు కనపడ్డాయి.

దీంతో క‌స్ట‌మ‌ర్ కోపంతో ఊగిపోయింది. ఆ సూప్ ప‌ట్టుకుని రెస్టారెంట్‌ మేనేజర్‌ జన్నెల్లే బ్రోలాండ్‌ వద్దకు వెళ్లి నిల‌దీసింది. ఆ వెంట‌నే వేడివేడి సూప్‌ను మేనేజర్ ముఖంపై పోసింది. అనంత‌రం అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. వేడివేడి సూప్ ముఖంపై ప‌డ‌డంతో రెస్టారెంట్ మేనేజ‌ర్ షాక్ కు గుర‌యింది. అనంత‌రం క‌స్ట‌మ‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి మేనేజ‌ర్ బ్రోలాండ్ ప్ర‌య‌త్నించింది. రెస్టారెంటు వ‌ద్ద ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆ క‌స్ట‌మ‌ర్ కారు ఫోటోలు తీయించింది. ఆ ఫొటోల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూప్ న‌చ్చ‌క‌పోతే ఫిర్యాదు చేయ‌కుండా క‌స్ట‌మ‌ర్ చేసిన ప‌ని ప‌ట్ల నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTV Footage  viral video  Angry Woman  soup  Hotel Manager  Face  Texas  Mexican  restaurant  US  America  Crime  

Other Articles