Heavy rains pound parts of Chennai, orange alert issued ముంచెత్తిన చెన్నైకి ఆరెంజ్ అలర్ట్.. విద్యాసంస్థలకు సెలవు

Orange alert to water logged chennai extremely heavy rainfall likely on nov 10 11

Chennai Flood, chennai flood alert, chennai flood live, chennai flood alert live, chennai flood news, chennai rain, chennai rain today, tamil nadu rain, tamil nadu rain updates, tamil nadu rain alert, IMD weather alert, chennai weatherman, chennai rain today, chennai flood today, chennai rain updates, chennai rain live, chennai rain live news, heavy rainfall in Tamil Nadu, weather update tamil nadu, Chennai weather, IMD, Predictions, Heavy to Very heavy rainfall, water logged chennai, Orange alert, 14 districts, Tamil Nadu

Following intense rainfall and waterlogging schools and colleges in the Tamil Nadu capital and 22 other districts will remain shut today. The IMD has predicted more rain in the coming days. It has issued an orange alert in 14 districts, including Cuddalore, Villupuram, Chennai, Kanchipuram, Chengalpattu, Tiruvallur, Vellore, Ranipet, Tirupattur, Nagapattinam, Mayiladuthurai, Kallakurichi, Tiruvannamalai and Salem districts of Tamil Nadu.

ముంచెత్తిన చెన్నైకి మళ్లీ ఆరెంజ్ అలర్ట్.. ఈనెల 10, 11న అతిభారీ వర్షాల హెచ్చరిక

Posted: 11/08/2021 03:25 PM IST
Orange alert to water logged chennai extremely heavy rainfall likely on nov 10 11

తమిళనాడులో ఏకబిగిన కురిసిన వర్షాలు రాజధాని చెన్నైని చెరువులా తలపింపజేశాయి. చెన్నై సహా 26 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కుమ్మేసిన వర్షాలు.. ఆయా జిల్లాల్లోని లోత్తట్టు ప్రాంతాలను జలదిగ్భంధంలోకి నెట్టివేశాయి. ఇప్పటికే వరుణుడు పగబట్టినట్టుగా వర్షం కురుస్తుండగా, ఇక తాజాగా భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెలువరించిన వార్త చెన్నైవాసులను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 10, 11 తేదీలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై నగరంతో పాటు సమీప 14 జిల్లాలకు కూడా ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇప్పటికే నిండా ముంచేసిన వర్షంతో.. అవస్థలు పడుతున్న స్థానికులు గజం స్థలం దొరికినా చాలు అనుకుంటుండగా, ఐఎండీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2015లో సంభవించిన వరదల భీభత్సాన్ని తలచుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా.? అని అందొళన చెందుతున్నారు. చెన్నై సహా దాని సమీప 14 జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుడ్డలూర్, విల్లుపురం, చెన్నై, కాంచిపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్, వెల్లూర్, రాణిపేట్, తిరుపట్టూర్, నాగపట్టణం, మియినలద్దుత్తురయ్,కాళ్లకూర్చి, తిరువణ్ణామలై, సేలం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని హెచ్చిరకలు జారీచేశారు.

దీనికి తోడు ఈ పద్నాలుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా కురిసే అవకాశం వుందని అధికారులు తెలిపారు. కాగా క్రితం రోజున రాజధాని చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌లో భారీ వర్షాపాతం నమోదైంది. వానలకు చెన్నైశివారు ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో స్థానికంగా జనజీవనం కూడా స్థంభించిపోయింది. ఆయా జిల్లాల్లోని వాహనాలు కూడా పూర్తిగా వర్షపు నీటిలో మునకేశాయి. నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని మూడు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.

కొళత్తూర్‌, పెరవళ్లూర్‌, కేకేనగర్‌, విల్లుపురం, కాంచీపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్ సహా పలుజిల్లాల్లో కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇండ్లలోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్‌ సరఫరా లేక బయటకు రాలేక.. ఇండ్లలో ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మోటార్లతో నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, మధురైలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. సహాయక చర్యల్లో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి.

ఇదిలా ఉండగా.. మరో రెండు రోజులు తమిళనాడులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెన్నై, సమీప జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురంలో పాఠశాలలు, కళాశాలలకు, తిరువళ్లూర్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles