BJP MP Arvind Sharma threatens Congress కాంగ్రెస్ కు బీజేపి ఎంపీ హెచ్చరికలు.!

Will take eyes out cut arms bjp mp arvind sharma threatens congress after colleague manish grover held hostage

BJP MP, Dr Arvind Sharma, threat, Congress, Deepender Hooda, BJP leader, Manish Grover, controversial comments, Arvind Sharma, manish grover, held hostage, congress, arvind sharma controversy, haryana controversy, protesting farmers, Haryana, Politics

BJP MP Dr Arvind Sharma sparked off a controversy by giving a veiled threat to Congress a day after his colleague and BJP leader Manish Grover was held hostage by protesting farmers. The clip of him making the controversial comments has gone viral. In the video, his followers are seen welcoming his veiled threat.

ITEMVIDEOS: ‘‘కళ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం’’: కాంగ్రెస్ కు బీజేపి ఎంపీ హెచ్చరికలు

Posted: 11/06/2021 07:58 PM IST
Will take eyes out cut arms bjp mp arvind sharma threatens congress after colleague manish grover held hostage

హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ అరవింద్‌ శర్మ శనివారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ విపక్ష పార్టీ నేతలపై రంకెలేసారు. అంతేకాదు విపక్షపార్టీ నేత దీపేందర్ హూడాను కూడా టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కళ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తామని’’ అన్నారు. ఇలా అధికారంలోని బీజేపి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక నెట్ జనులు పార్లమెంటు సభ్యులు మాట్లాడిన వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఔను ఇంతలా ఆయన కాంగ్రెస్ నేతలపై ఎందుకు విరుచుకుపడ్డారు.

ఇంతకీ ఆయన ఏం అన్నారంటే.. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించే వారి కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. క్రితం రోజున రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను రైతులు శుక్రవారం ఘెరావ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను పని లేని తాగుబోతులని ఆయన విమర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మనీష్‌ గ్రోవర్‌ గుడిలో ఉన్నట్లు తెలిసి దానిని చుట్టుముట్టారు. సుమారు 8 గంటల పాటు గుడిలో ఉన్న బీజేపీ నేతలను నిర్బంధించారు. గ్రోవర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చివరకు చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. దీనిపై హర్యానాలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారు. అయితే తాను ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని అనంతరం గ్రోవర్‌ అన్నారు. చేతులు ఊపాలని తనను కోరగా తాను అలా చేసినట్లు చెప్పారు. మరోవైపు రోహతక్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ శర్మ, ఈ పరిణామాలపై స్పందించారు. తమ పార్టీ నేత గ్రోవర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్‌ నేతల కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని ఆయన హెచ్చరించారు. హర్యానాలో 25 ఏండ్లు తాము అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌ చక్కర్లు కొడుతుందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles