Man punished by cow for harassing dog ఇన్ స్టంట్ కర్మ.. ఇలా పాపం.. అలా పర్యవసానం

Video of a cow saving a dog being tortured by a man goes viral

Dog, Cow, viral video, animal torture, Animal Cruelty, Animal Video, Viral Animal Video Dog, Cow, Viral Video, animal torture, animal cruelty, animal video, viral animal video

In today's world, humans have the least amount of humanity within them, while animals have the greatest. When a cow stopped a man torturing a dog, the horrific video took an unexpected end. The man repeatedly pulled the dog up by its neck as the animal whimpered and moaned in pain, according to a video that has gone viral on the internet.

ITEMVIDEOS: ఇన్ స్టంట్ కర్మ.. ఇలా పాపం.. అలా పర్యవసానం

Posted: 11/02/2021 05:47 PM IST
Video of a cow saving a dog being tortured by a man goes viral

ఒకప్పుడు మంచి ఎక్కువగా వుండేది. మనుషుల్లో మానవత్తం ఉండేది. కానీ ఇప్పడు మంచి అన్నది మచ్చకు కూడా కనిపించకుండా పోతోంది. ఇక మానవత్వం అంటే మనుషుల నుంచి మాయం అయిపోయింది. అప్పట్లో ఏదైనా తప్పు చేస్తే.. ఈ తప్పుకు నీ బిడ్డలు బలకావాల్సి వస్తుందనో.. నీవు చేసిన తప్పులకు నీ సంతానం ఎందుకు బాధపడాలనో పెద్దలు అనేవారు. కానీ ఇప్పట్లో పెద్దలు మాత్రం ఒరేయ్ నువ్వు తప్పు చేస్తే నువ్వే అనుభవిస్తావ్.. తొందరపడకు అని హెచ్చరిస్తుంటారు. అయితే వారి మాటలను అలక్ష్యపెడితే ఏం జరుగుతుందో తెలుసా..? నిజంగానే కుక్క చావు చావాల్సివస్తుంది.

అదేంటి అంతమాట అన్నారు అంటారా..? కాసింత విచిత్రమే అయినా ఇది పూర్తిగా నిజం. ఎందుకంటే మనం చేసే తప్పులకు మనమే బాధ్యలం అవుతాం. కాగా, కలియుగం కూడా చరమాంకానికి చేరుకుందనో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తప్పు చేస్తూ ఆ వెంటనే ప్రతిఫలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదెలా అంటే సరిగ్గా ఇన్ స్టాంట్ క‌ర్మ‌ల తరహాలాగే. పాపం చేస్తే వెంట‌నే దాని ఫ‌లితం అనుభ‌విస్తున్నాం. తోటి మనుషులకు సాయం చేయగలగాలి.. తోటి జీవరాశుల యందు భూతదయ కలిగివుండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. మూగ జీవాల‌ను హింసిస్తే పాపం అవి ఎదురు కూడా తిర‌గ‌లేవు. దాన్నే అలుసుగా తీసుకొని మూగ‌జీవాల‌పై చాలామంది రెచ్చిపోతుంటారు.

ఇలాగే ఓ వీధి కుక్క‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపించిన ఓ వ్య‌క్తికి టిట్ ఫ‌ర్ టాట్ అయింది. కుక్క చెవుల‌ను ప‌ట్టుకొని పైకి లాగి.. దాన్ని చిత్ర‌వ‌ధ చేశాడు ఓ వ్య‌క్తి. అక్క‌డున్న వాళ్లంతా వీడియోలు తీస్తూ నిల‌బ‌డ్డారు త‌ప్పితే ఒక్క‌రు కూడా ఆ వ్య‌క్తిని అడ్డుకోలేదు. ఒక మూగ జీవి బాధ మ‌రో మూగ జీవికే తెలుస్తుంది కాబోలు.. వెంటనే అక్క‌డికి ఓ ఆవు ప‌రిగెత్తుకొచ్చి.. కుక్క‌ను హింసిస్తున్న ఆ వ్య‌క్తిపై విరుచుకుప‌డింది. త‌న కొమ్ముల‌తో అత‌డిపై దాడి చేసింది. దీంతో అత‌డు ఆ కుక్క‌ను వ‌దిలిపెట్టేశాడు. దీంతో బ‌తుకు జీవుడా అంటూ ఆ కుక్క అక్క‌డి నుంచి పారిపోయింది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద‌.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karma  instant karma  Viral video  cow and dog  harassment of dog  cow punishes man  miscellany  

Other Articles