Former minister Anil Deshmukh produced before court మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ

Former maharashtra home minister anil deshmukh produced before court by ed

Anil Deshmukh, param bir singh, deshmukh, Enforcement directorate, mumbai news, mumbai, maharashtra, anil deshmukh, Maharashtra, Crime

Hours after he was arrested, former Maharashtra home minister Anil Deshmukh was on Tuesday, produced before the PMLA court. As per sources, the central agency is likely to seek his custody for further investigation. He was taken for his medical check-up in Mumbai. Deshmukh was arrested by the Enforcement Directorate late on Monday night after over 12 hours of questioning in a money-laundering case.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ

Posted: 11/02/2021 12:49 PM IST
Former maharashtra home minister anil deshmukh produced before court by ed

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌‌ (71) ను  గతరాత్రి ఈడీ అధికారులు అరెస్టుచేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న తరువాత దాదాపు 12 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం ముంబైలోని అసుపత్రికి తరలించిన ఆధికారులు అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన పిమ్మట ఇవాళ ఆయనను ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చారు. దీంతో అనీల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన అధికారులు.. ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చారు.

ఈ క్రమంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన అనిల్ దేశ్ ముఖ్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి వుందని.. దీంతో ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు సంస్థ న్యాయస్థానాన్ని కోరనుంది. ఈ మేరకు పిటీషన్ కూడా దాఖలు చేయనుంది. దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ విచారణను ప్రారంభించేందుకు సన్నధం కాగా, న్యాయమూర్తి పిబి జాదవ్ అనిల్ దేశ్ ముఖ్ కు తన న్యాయవాదితో మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించారు.

ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇదే కేసులో సమన్లు జారీ చేసిన ఈడీ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది.

ఈడీ సమన్ల రద్దు కోరుతూ శుక్రవారం బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ మాజీ మంత్రికి నిరాశే ఎదురైంది. దీంతో ఇటీవల ఆయన ఆస్తులపైనా ఈడీ దాడి చేసి జప్తు చేసింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ నిన్న ఓ వీడియో ద్వారా ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఎక్కడ అని ప్రశ్నించారు. సొంత డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా పలువురు వ్యాపారవేత్తలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని అన్నారు. కాగా, అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో తొలి అరెస్ట్ నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles