Priyanka Gandhi meets families of farmers in Lalitpur అసువులు బాసిన రైతు కుటుంబాలకు ప్రియాంక ఓదార్పు

The govt has failed it has completely ignored farmers says priyanka gandhi

priyanka gandhi, nikhil pathak, mailwara khurd, lalitpur, congress, fertilizers, farmers, PM Modi, CM Yogi, Bhudhelkhand, Uttar pradesh Politics

Congress General Secretary Priyanka Gandhi Vadra met the families of four deceased farmers here, who had allegedly faced shortage of fertilisers, and assured them of all possible help. A Congress spokesman claimed that there is an "absolute shortage of fertilisers in the Bundelkhand region due to which many farmers have died and one has committed suicide".

ఎరువుల కోసం అసువులు బాసిన రైతు కుటుంబాలకు ప్రియాంక ఓదార్పు

Posted: 10/29/2021 04:41 PM IST
The govt has failed it has completely ignored farmers says priyanka gandhi

ఎరువుల కోసం దుకాణాల ఎదుట గంటల కొద్దీ సమయం నిలబడి.. అస్వస్థతలోనై రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ మధ్య రైతులకు ఏం జరిగినా అది వార్త కాదు అన్నట్లు మారిపోతోంది. అలానే ఈ వార్త కూడా పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కానీ ఇవాళ ఆ నలుగురు రైతు కుటంబాలను ఓదార్చేందుకు తన సంతాపాన్ని తెలిపేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావడంతో విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది.

ప్రియాంక గాంధీ వాద్రా అసువులు బాసిన రైతు కుటుంబాలను ఇవాళ కలిశారు. అయితే అమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి పరామర్శల కోసం వస్తే చాలు అడ్డుకునే పోలీసులు ఈ సారి అమెను ఎక్కడా అడ్డుకోలేదు. దీంతో అమె నేరుగా లలిత్ పూర్ కు వెళ్లి అక్కడ మరణించిన నలుగురు రైతు కుటుంబాలను పరామార్శించారు. బాధిత కుటుంబాలకు తాము అండగా నిలబడతామని అన్నారు. తమ పార్టీ తరపున అమ వారికి తగు సాయాన్ని అందిస్తామని ప్రియాంక హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఎరువుల కొరతతో రైతులు బాధపడుతన్నా వారిని ఆదుకునే చర్యలను ప్రభుత్వం తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు వారు ఎంత ప్రయత్నించినా వారిని ప్రభుత్వం లక్ష్యపెట్టడం లేదంటూ దుయ్యబట్టారు. వారు కొన్ని నెలల నుంచి రోడ్లపై కూర్చోని నిరసలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి పట్టదు.

రైతులు బాధలు వినేందుకు ప్రభుత్వం వద్ద అసలు సమయమే లేదని ధ్వజమెత్తారు. రైతులను పూర్తిగా విస్మరించి రాష్ట్రమంతా సస్యశ్యామలంగా, నిర్మలంగా ఉందని ప్రచారాలు చేసుకుంటారు. రైతులకు ఎరువులు కూడా అందించలేని దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే అందుకు కారణం ప్రభుత్వం కాదా అని అమె ప్రశ్నించారు. రైతులను అలక్ష్యం చేసే ప్రభుత్వంలోని నేతలకు.. వారిని వాహనాలతో తొక్కించేందుకు మాత్రం చాలా సమయం ఉంటుందని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రియాంకాగాంధీ చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles