Will Not Tolerate Injustice To Farmers: Varun Gandhi కనీస మద్దుతు ధరపై చట్టబద్దత అత్యవసరం: వరుణ్ గాంధీ

Will go to court not govt people clap as varun gandhi takes up farm issues

farmers protest, farmers protest Uttar Pradesh, priyanka gandhi, varun gandhi, varun gandhi farmers law, Varun Gandhi farmers, Varun Gandhi farm laws, Varun Gandhi news, varun gandhi BJP, Uttar pradesh Politics

BJP MP Varun Gandhi once again took up the farmers' issue and said that he will not put up with any kind of irregularities in crop procurement in his constituency. The MP, who is believed to have invoked the wrath of the BJP by his continuous criticism of the farm laws and the UP government, posted his video interacting with some officials, farmers.

దళారుల అవినీతికి.. కనీస మద్దతు ధర చట్టబద్దతే కళ్ళం: వరుణ్ గాంధీ

Posted: 10/29/2021 05:57 PM IST
Will go to court not govt people clap as varun gandhi takes up farm issues

ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి, అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పరామర్శించిన నేపథ్యంలో ఇదే సమయంలో అటు అమె సోదరుడు, బీజేపి ఎంపీ వరుణ్ గాంధీ కూడా రైతుల సమస్యను తీసుకుని మీడియాలోకి ఎక్కారు. ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ కు వెళ్లిన ప్రియాంకా గాంధీ రైతు కుటుంబాలను ఓదార్చగా.. వరుణ్ గాంధీ మాత్రం రైతులకు గిట్టుబాటు ధర రాకుండా మధ్యలో కమీషన్ల కక్కుర్తితో మధ్యవర్తులు చేస్తున్న లాబియింగ్కు కళ్లెం వేశాడు.

రైతు సమస్యలపై సోంత పార్టీకి చెందిన ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు తన నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి రైతు సమస్యలు తిష్ట వేయకుండా ప్రతీ మార్కెట్ యార్డులో తన ప్రతినిధులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వైపు రైతుల ధాన్యం తడిచినవని, నల్లగా వున్నాయన్న ఇతరాత్ర కారణాలతో తిరస్కరించే ప్రయత్నం కూడా చేయరాదని ఆయన అధికారులకు సూచించారు. రైతులకు వ్యాపారులకు మధ్య మధ్యవర్తుల లాభియింగ్ జరిగిన పక్షంలో తగు సాక్ష్యాధారాలతో తాము ప్రభుత్వం వద్దకు కాకుండా న్యాయస్థానం వద్దకు వెళ్లి అధికారులందరినీ అరెస్టు చేయిస్తానని హెచ్చరించారు.

యూపీలోని వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారులు కూడా ప్రజల మాదిరిగానే ధరాఘాతం ప్రభావాన్ని చవిచూస్తున్నారా? లేదా.? అని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆరుగాలం పండించిన పంటను రైతులు అరకొర ధరలకు ఎందుకు విక్రయిస్తారని నిలదీశారు. రైతుల కష్టానికి తగిన ఫలితం వారికి ఇవ్వాలని సూచించారు. రైతుల ఇబ్బందుల గురించి ఆయ‌న బ‌రేలిలోని ఓ మండీలో అధికారితో మాట్లాడుతున్న వీడియోను వ‌రుణ్ గాంధీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దేశ‌వ్యాప్తంగా రైతులు మ‌ద్ద‌తు ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్మేలా వ్యాపారులు, ద‌ళారులు కుమ్మ‌క్క‌వుతున్నార‌ని ఈ వీడియోలో వ‌రుణ్ గాంధీ స‌ద‌రు అధికారితో పేర్కొన‌డం క‌నిపించింది.

రైతుల‌ను ఇబ్బంది పెడుతున్న అధికారుల‌ను తాను స‌హించ‌న‌ని వారిని అరెస్ట్ చేసేలా కోర్టుకెక్కుతాన‌ని అధికారిని వ‌రుణ్ గాంధీ వీడియోలో హెచ్చ‌రించారు. ద‌ళారుల ప్ర‌మేయం లేకుండా త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునే రైతులను అధికారులు వేధిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాను ఓ వ్య‌వ‌సాయ మార్కెట్‌ను సంద‌ర్శించ‌గా అక్క‌డ 5 కాంటాలు ఉన్న‌ట్టు రికార్డుల్లో ఉన్నా కేవ‌లం మూడే ప‌నిచేస్తున్నాయ‌ని వ‌రుణ్ గాంధీ చెప్పుకొచ్చారు. రైతు స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న వ‌రుణ్ గాంధీని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ప‌క్క‌న‌పెట్టినా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అన్న‌దాత‌ల‌కు భ‌రోసా క‌ల్పించేలా త‌న వాణి వినిపిస్తూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles