Facebook is rebranding itself as 'Meta' ఫేస్ బుక్ మాతృసంస్థ పేరు ‘మెటా’గా మార్పు: మార్క్ జుకర్‌బర్గ్

Facebook the company rebrands as meta to take us all into the metaverse

mark zuckerberg, meta, metaverse, facebook, Whatsapp, messenger, Instagram, Social media, Face book rebranding Meta, Google, Alphabet, stock ticker, FB, MVRS

Facebook, the social network, will no longer define the future of Facebook, the company that will now be known as Meta. Facebook Inc. is changing the name in order to distinguish its beleaguered social network, which has an increasingly poor reputation around the globe, from the company that is pinning its future on the promise of a “metaverse.”

ఫేస్ బుక్ మాతృసంస్థ పేరు ‘మెటా’గా మార్పు: మార్క్ జుకర్‌బర్గ్

Posted: 10/29/2021 11:02 AM IST
Facebook the company rebrands as meta to take us all into the metaverse

ప్రపంచాన్ని ప్రజల అరచేతిలోకి తీసుకువచ్చి సాంకేతిక విప్లవమే అయినా.. దానిని మరింత చేరువ చేసింది మాత్రం సామాజిక మాధ్యమాలే అని చెప్పాలి. ఇక ఈ సోషల్ మీడియాలో అగ్రస్థానన నిలిచిన ఫేస్‌ బుక్‌ గురించి తెలియని వారుండరు. గ్రామీణ భారతంలోనూ ఫేస్ బుక్ లేదా వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రపంచ నెటిజనులను అకట్టుకున్న ఫేస్ బుక్ సంస్థ.. తమ పేరును మార్చబోతున్నట్లు గత కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పేస్ బుక్ సంస్థ తాజాగా క్లారిటీని ఇచ్చింది.

ఇకపై ఈ కంపెనీని ‘మెటా’గా పిలవనున్నట్టు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఈ మేరకు గురువారం తమ సంస్థ పేరును అధికారికంగా మర్చినట్టు ఆయన తెలిపారు. పేరు మార్పునకు గల కారణాలను జుకర్‌బర్గ్ వివరిస్తూ.. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్) కు ప్రాధాన్యం పెరగబోతోందని, దానిని దృష్టిలో పెట్టుకునే ఫేస్ బుక్ సంస్థ పేరును ‘మెటా’గా మార్చినట్టు పేర్కొన్నారు. కాగా, ఫెస్ బుక్ తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్ స్ట్రాగ్రాం, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉంటుందన్నారు.

వర్చు‌వ‌ల్‌/‌ఆ‌గ్యు‌మెం‌టెడ్‌ రియా‌లి‌టీలో విని‌యో‌గ‌దా‌రులు సంభా‌షిం‌చు‌కొ‌నేలా ఫేస్‌‌బుక్‌ త్వరలో సేవ‌లను అందు‌బా‌టు‌లోకి తీసు‌కు‌రా‌నుంది. దీనిని మెటా‌వ‌ర్స్‌గా చెప్తు‌న్నారు. అయితే, సమా‌చార దుర్వి‌ని‌యోగం, సమా‌చార భద్రతపై ఆందో‌ళ‌నలు.. విద్వే‌షాన్ని వ్యాప్తి చేయడం ద్వారా డబ్బులు ఆర్జి‌స్తు‌న్నదన్న ఆరో‌ప‌ణల నేప‌థ్యంలో, ఈ విమ‌ర్శల నుంచి దృష్టి మర‌ల్చేం‌దుకే జుక‌ర్‌‌బర్గ్‌ ఫేస్‌‌బుక్‌ పేరును మార్చా‌రని ఆరో‌ప‌ణలు వస్తు‌న్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Meta  metaverse  Mark Zuckerberg  Whatsapp  messenger  Instagram  Social media  

Other Articles