Shaktikanta Das reappointed RBI chief for three-year term శక్తికాంత్ దాసే మళ్లీ ఆర్బీఐ గవర్నర్.. కేంద్రం ఉత్తర్వులు..!

Rbi governor shaktikanta das to remain in office for three more years

rbi governor, shaktikanta das, rbi governor shaktikanta das, reserve bank of india, RBI, World Bank, Asian Development Bank, New Development Bank, Asian Infrastructure Investment Bank, economic policies, finance ministry, cabinet appointments committee

The government has reappointed Shaktikanta Das as the Reserve Bank of India's (RBI) governor for three more years. The re-appointment is effective from December 10, or until further orders, whichever is earlier. The decision was approved by the appointments committee of the cabinet late on Thursday.

శక్తికాంత్ దాసే మళ్లీ ఆర్బీఐ గవర్నర్.. మూడేళ్లు పోగడిస్తూ కేంద్రం ఉత్తర్వులు..!

Posted: 10/29/2021 12:01 PM IST
Rbi governor shaktikanta das to remain in office for three more years

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా మరోమారు శక్తికాంత దాస్ నే నియమిస్తూ క్యాబినెట్ అపాయింట్స్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మరో మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించనున్నారు. సాధారణంగా మూడేళ్ల పాటు ఉండే అర్భీఐ గవర్నర్ పదవిలో 2018లో శక్తికాంత్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మూడేళ్ల పదవికాలం ఈ డిసెంబర్ 10తో ముగియనుంది. ఈ తరుణంలో ఆయనను మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగించేలా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆయన మరో మూడేళ్ల పాటు అర్బీఐ గవర్నర్ గా కొనసాగనున్నారు.

శక్తికాంత దాస్ పునఃనియామకాన్ని అమోదించిన కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ.. ఆయన ఈ పదవిలో 10 డిసెంబరు 2021 నుంచి మూడేళ్ల పాటు అంటే 10 డిసెంబర్ 2024 వరకు లేదా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. కాగా శక్తికాంత్ దాస్ ఈ పదవిలో పూర్తికాలం కొనసాగిన పక్షంలో ఆయన గత ఏడు దశాబ్దాల కాలంలో అత్యధిక కాలం అర్బీఐ గవర్నర్ గా కొనసాగిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. అయితే ఆయన నియామకంతో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిపుష్టి కోసం అమలవుతున్న ఆర్థిక విధానాలు యధావిధంగా కోనసాగుతాయన్న సంకేతాలను కూడా కేంద్ర దేశ ప్రజలకు అందించినట్లు అయ్యింది.

ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా గతంలో పనిచేసిన శక్తికాంత దాస్ 11 డిసెంబరు 2018లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీ అనుబంధంగా వున్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి పోస్టు గ్రాడ్యూయేట్ పట్టాను అందుకున్న శక్తికాంత్ దాస్.. ఆర్థిక, పన్ను, పారిశ్రామిక, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విభాగాలలో అటు రాష్ట్ర, ఇటు కేంద్ర స్థాయిలలో అనేక కీలక పదవులను నిర్వహించారు. అనేక పాలనాపరమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దోమధపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles