Actor Molested On Flight, UP Businessman Arrested విమానం దిగబోతున్న నటిపై వ్యాపారవేత్త లైంగిక వేధింపులు

Uttar pradesh businessman arrested for allegedly molesting actress in delhi mumbai flight

actress molested, crimes against women, businessman, arrest, molestation case, businessman molests actress, Sahar police station, Mumbai Police, Ghaziabad businessman, UP businessman molests actress, UP businessman arrested, Mumbai Police, Chhatrapati Shivaji International Airport, crime

Actress molested on flight: A Mumbai based actor was allegedly molested by a businessman on a Delhi-Mumbai flight earlier this month. The accused in the case was taken into custody recently after the actor filed a complaint with the police.

విమానం దిగబోతున్న నటిపై వ్యాపారవేత్త లైంగిక వేధింపులు

Posted: 10/20/2021 05:17 PM IST
Uttar pradesh businessman arrested for allegedly molesting actress in delhi mumbai flight

విమానం ప్రయాణం చేసిన నటికి ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమనాశ్రయంలో పరాభవం ఎదురైంది. విమానం నుంచి దిగేందుకు ప్రయత్నిస్తున్న అమెను ఓ వ్యాపారవేత్త లైంగికంగా వేధించాడు. విమానంలో అందరూ వుండగానే ఇలాంటి చర్యలకు ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన వ్యాపారి పాల్పడ్డాడు. వెంటనే బిగ్గరగా అరుస్తూ.. విమాన సిబ్బందికి సహాయం కోరిన నటి.. వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. అక్టోబర్ 3న జరగిన ఈ ఘటనలో వ్యాపారవేత్తను ముంబైలోని సహార్‌ పోలీసులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. దీంతో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో వ్యాపారవేత్త కటకటాల వెనక్కి వెళ్లారు.

కాగా పోలీసులకు, విమాన సంస్థ అధికారులకు తప్పుడు పేరు చెప్పి బోల్తా కొట్టించాలని వ్యాపారవేత్త చేసిన ప్రయత్నం కూడా బెడిసికోట్టింది. చివరకు వ్యాపారవేత్త ఫొటోను చూసి నటి గుర్తించడంతో.. అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన విమానంలో ఓవర్ హెడ్ స్టోరేజ్ నుంచి బ్యాగులు తీసుకుంటున్న ఓ నటిని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేశాడు. అక్టోబర్ 3న ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించానని ఈ 40 ఏండ్ల నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్ హెడ్ స్టోరేజ్ తెరిచి హ్యాండ్‌ బ్యాగు తీసుకునేందుకు నటి లేచింది. హ్యాండ్‌ బ్యాగులను తీస్తున్న సమయంలో ఎవరో తనను తప్పుగా తాకినట్లు గుర్తించింది. తీరా చూస్తే గజియాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అమె నడుమును తన చేయితో చుడుతూ.. తనపైకి అమెను లాగేసుకునే ప్రయత్నం చేశాడు. అకస్మాత్తుగా విమానంలో అందరి ప్రయాణికుల సమక్షంలో ఈ ఘటన జరగడంతో అందోళనకు, అభద్రతా భవనకు గురైన నటి వ్యాపారవేత్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న క్యాబిన్ సిబ్బందికి కూడా ఫిర్యాదు చేసింది.

మెయిల్‌లో ఫిర్యాదు చేయాలని క్యాబిన్ సిబ్బంది నటికి సూచించారు. దాంతో ఆమె తొలుత వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి సహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సహార్‌ పోలీసులు నితిన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడికి మూడు రోజుల కస్టడీ విధించింది. పోలీసుల విచారణలో తొలుత తన పేరును రాజీవ్‌ అని చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆయన పేరు నితిన్‌ అని విమానయాన సంస్థ ధ్రువీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles