ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లుగా ఆప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్నారు. కాగా అమరావతి రైతుల నిరసన దీక్షలు ఇవాళ్టికి ఏకంగా 666 రోజుకు చేరకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోని మోతడకలో రైతులు సమావేశాలు నిర్వహిచారు. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల విధానానికి స్వస్తి పలికి ఏకైక అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజధాని ఉధ్యమగీతాలను ఆలపించారు. గీతాలతో కూడిన పలు సీడిలను అవిష్కరించారు.
ఈ సందర్భంగా జేఏసీ, ప్రజా సంఘాలు, సీపీఐ నేతలు మాట్లాడుతూ.. అమరావతిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని సమూలంగా నాశనం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా అర్థ, అంగ బలగాలను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ తెలిపారు. అధికారంలోకి రాకముందు అసెంబ్లీ సాక్షితా అమరావతి రాజధానికి జైకోట్టిన జగన్.. అధికారంలోకి రాగానే ఎందుకు మాటమార్చి మూడు రాజధానుల పాటను అందుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరించడ మానేసి.. ప్రజల పక్షాన నిలిచి అలోచిస్తే పాలన జనరంజకంగా వుంటుందని అన్నారు.
ఆంధ్రులంతా ఏకమై ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వీరాంజనేయులు పిలుపునిచ్చారు. అమరావతి ఆందోళనల్లో భాగంగా నెక్కల్లు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. కాగా, ఉద్యమం 666వ రోజుకు చేరుకున్న సందర్భంగా ‘‘అహో ఆంధ్రులారా అసమాన ధీరులారా.. రాజధాని సమర సైనికులారా.. అమరావతికి అండగా నిలవండి.. భావి తరాలను కాపాడండి’’ అని సాగే ఉద్యమ గీతాన్ని అమరావతి జేఏసీ నేతలు విడుదల చేశారు. హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ఈ గీతాలను రచించి ఆర్థిక సహకారం కూడా అందించారు. ప్రజా నాట్యమండలికి చెందిన రమణ బృందం ఈ గీతాలను ఆలపించింది.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more