Lakhimpur Kheri: Priyanka Gandhi pays respects to deceased farmers లఖీంపూర్ ఘటన: రైతుల సంతాపసభకు హాజరైన ప్రియాంక గాంధీ

Lakhimpur kheri violence priyanka gandhi pays respects to deceased farmers

Sanyukta Kisan Morcha, yogendra yadav, Amit Shah, PM Modi, burn effigies, Dussehra, rail roko, Lakhimpur kheri news, Lakhimpur kheri protest, Farmer Gherao, Lakhimpur Kheri, Farmer dead in Protest, Farmer Protest, deceased Farmers, Antim Ardas, Priyanka Gandhi, Congress, Chattisgarh CM, Lakhimpur Kheri, Lakhimpur Kheri Updates, Assam, farmer protest updates, accident, farmer death, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Lakhimpur Kheri Violence: Security was heightened in Lakhimpur Kheri, where the ‘antim ardas’ (last prayers) of the farmers killed in the October 3 violence was held. Thousands of farmers from Punjab, Haryana, Uttarakhand and other parts of Uttar Pradesh streamed into the district to attend the event. Congress leader Priyanka Gandhi Vadra and Rashtriya Lok Dal chief Jayant Chaudhary are among those who attended.

లఖీంపూర్ ఘటన: రైతుల సంతాపసభకు హాజరైన ప్రియాంక గాంధీ

Posted: 10/12/2021 05:59 PM IST
Lakhimpur kheri violence priyanka gandhi pays respects to deceased farmers

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ ఘటనలో చనిపోయిన నలుగురు రైతుల మరణానికి సంయుక్తి కిసాన్ మోర్చ ఇవాళ వేలాది మంది రైతులతో ఘన నివాళులు అర్పించింది. సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఇవాళ హక్కుల సాధనలో అమరులైన రైతులకు ఇవాళ అంతిమ ప్రార్థనల పేరుతో అంతిమ్ అర్దాస్ నిర్వహించారు. ఈ ప్రార్థనలకు హాజరయ్యేందుకు కిసాన్ పోరాట సమితి అధ్యక్షుడు రాకేసశ్ తికాయత్ నిన్న సాయంత్రమే ఇక్కడకు విచ్చేయగా, ఇవాళ లఖీంపూర్ ఖేరికి బయలుదేరి వస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.

సీతాపూర్ లో ప్రియాంక గాంధీ వాద్రాను అడ్డుకున్న పోలీసులు.. మరోవైపు అర్ఎల్డీ నేత జయంత్‌ చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను బరేలిలో హాజ్ అరెస్ట్ లో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరణించిన రైతులకు నివాళులర్పించేందుకు ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ నుంచి దాదాపు 50 వేల మంది రైతులు చేరుకున్నారు. తొలుత పాలియా నుంచి వచ్చిన రాగి జాతా గుర్బానీని వివరించడం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. మరణించిన రైతుల కుటుంబాలు, గాయపడిన రైతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

కాగా ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు ప్రియాంక గాంధీకి పోలీసులు లఖింపూర్ ఖేరికి వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేయడంలో అమె టికునియాకు చేరుకుని అమరవీరులైన రైతుల అంతిమ్ అర్దాస్ కు హాజరయ్యారు. రైతులు ఘనంగా నివాళులు ఘటించారు. ఇక అర్ఎల్డీ నేత జయంత్ చౌదరీని కూడా పోలీసులు అంతిమ్ అర్థాస్ కు వెళ్లేందుకు అనుమతించడంతో ఆయన కూడా హాజరై రైతుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరిలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ను అడ్డుకుని రైతులు ఘెరావ్ చేయడంతో వారిని తోక్కించుకుంటూ వెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతర అల్లర్ల ఘటనలో మరో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles