JanaSena questions YCP govt on Employees salaries పెన్షనర్ల పాలిట 1వ తేదీ ఆర్థాన్ని మార్చేసిన వైసీపీ సర్కార్: జనసేన

Janasena questions ycp govt on retired employees pension amount

AP CM YS Jagan, YSRCP Election Promise, Employees, pensioners, janasena, YSRCP, First day of Month, salaries, pensions, Unemployment youth, Pawan Kalyan, Employment, Mega DSC, Teachers Recruitment, Government jobs, janasena, job calendar, AP Govt jobs, Andhra Pradesh, Politics

Janasena comes in support of Andhra Pradesh Employees and Pensioners, who eagerly wait for the First of every month to come for their salaries and Pension amount. Pawan Kalyan alleges that YCP govt had changed the importance of the First of every month by not issuing salaries on specified date.

ఉద్యోగల పాలిట ఒకటో తారీఖు ఆర్థాన్ని మార్చేసిన వైసీపీ సర్కార్: పవన్ కల్యాణ్

Posted: 10/08/2021 05:53 PM IST
Janasena questions ycp govt on retired employees pension amount

రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సారి ఉధ్యోగులు, పెన్షనర్ల కష్టాలపై ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తారీఖు తమ కష్టాలను తీర్చే రోజని ఇన్నాళ్లు భావించారని, అయితే వైసీపీ పాలనతో ఒకటో తారీఖుకు వున్న ప్రాముఖ్యత చెరిగిపోయిందని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ప్రభుత్వం కోసం పనిచేస్తూ కూడా జీతాల కోసం ఒకటో తారీఖు తరువాత కూడా ఉద్యోగులు పడిగాపులు కాయాల్సిన దౌర్భాగ్యం రాష్ట్రంలో అలుముకుందని అన్నారు.

ఒకటో తారీఖు అంటే జీతాలు, వేతనాలు, పెన్షన్లు వచ్చే రోజని భావించిన ఉద్యోగులు, కార్మికులు, పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు భావిస్తారని, అయితే ఒకటవ తేదీకి ఆ ప్రాముఖ్యతను, అర్థాన్ని రెండింటినీ మార్చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఒకటో తేదీన వేతనాలు వస్తాయన్న విషయాన్ని కూడా ఉద్యోగులు మార్చిపోయేలా వైసీపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఎప్పడు లభిస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకోందని, ఈ అనిశ్చితికి ఏపీ ప్రభుత్వ అర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోందని పేర్కోన్నారు.

పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు తమ సర్వీసునంతా ప్రభుత్వానికి ఖర్చు చేసినా.. వారికి కూడా సకాలంలో పెన్షన్లు అందకపోవడం బాధాకరమని అన్నారు. దశాబ్దాల పాటు ఉద్యోగ సేవలు అందించి విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నా.. పదే పదే పెన్షన్ల వచ్చాయా లేదా అని చూసుకోవడం కోసం బయటకు వెళ్తున్నారని, కొందరు ఇంకా పెన్షన్ రాలేదని అందోళనకు గురవుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని పవన్ చెప్పారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారని అభిప్రాయపడ్డారు.

పోలీసులకు గడచిన 11 నెలలుగా టి.ఏ కూడా లభించడంలేదని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం 7 డి.ఏలు బకాయి పడిందని, పీఆర్సీ కూడా అమలు చేయడంలేదని ఆరోపించారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డి.ఏ, టి.ఏ, పీఆర్సీ అడగరని, జీతం ఇస్తే అదే పదివేలు అని ఉద్యోగులు భావిస్తారని ప్రభుత్వం అనుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గతేడాది కంటే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయని, మరి ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడంలేదంటే ఆ ఆదాయం ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles