Pawan Kalyan shares a video, goes viral on net ‘‘వీళ్లే నా గుండె చప్పుళ్లు’’ జనసేనాని వీడియో వైరల్.!

Janasena chief pawan kalyan shares a video goes viral on net

janasainiks video, Pawan Kalyan, Janasena, knee level water, police obstacles, janasena meet, Andhra Pradesh, Politics, twitter, video viral, Internet, social media, viral video

A video of a Jana saniks walking through farms with a water flow of knee level, stating that the police are also supporting the Rowdy government and creating obstacles not to attend Janasena party meeting.

ITEMVIDEOS: ‘‘వీళ్లే నా గుండె చప్పుళ్లు’’ జనసేనాని వీడియో వైరల్.!

Posted: 10/05/2021 07:37 PM IST
Janasena chief pawan kalyan shares a video goes viral on net

జనసేనాని పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయ సమావేశాలకు హాజరవుతూ.. పార్టీని సంస్థాగతంగా బలపర్చుకుంటూనే మరోవైపు వరుస సినిమాలపై దృష్టి సారించారు. అయితే రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన.. అక్కడ చేసిన పలు వ్యాఖ్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడిని రగిల్చింది. జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో దూరంగా జరిగిన తెలుగు ఫిల్మ్ చాంబర్.. ఏపీ ప్రభుత్వానికి తాము అనుకూలంగా వుంటామంటూనే.. మరోవైపు పవన్ కల్యాణ్ తో భేటీ అయి తమ సమస్యలను వెల్లబోసుకుంది.

దీనిని పక్కనబెడితే ఏపీలో రాజుకున్న రాజకీయ వేడి నేపథ్యంలో గత కొన్నిరోజులుగా జనసేనాని తన రాజకీయ కార్యకలాపాల్లో దూకుడు కనబరుస్తున్నారు. సినిమా టికెట్ల వ్యవహారం, రోడ్ల పరిస్థితులు, శ్రమదానం వంటి అంశాల్లో అది స్పష్టంగా కనిపించింది. ఆయన శ్రమధానం కార్యక్రమం నేపథ్యంలో ఎంచుకున్న రోడ్లను యుద్ద ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. ఆయనకు కానీ ఆయన పార్టీ నేతలకు కానీ ఆయా ప్రాంతాల్లో శ్రమధానం చేసేలా ఎలాంటి అవకాశాన్ని ప్రభుత్వం మిగల్చలేదు. అంతకుముందు రోడ్లు పరిస్థితి అంతా బాగుందన్న ప్రభుత్వం.. పవన్ కల్యాణ్ ప్రకటన నేపథ్యంలో దిగిరాక తప్పలేదు.

కాగా, తాజాగా పవన్ కల్యాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. సభకు వస్తున్న జనసైనికులు మోకాలి లోతు నీళ్లలో నడుస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. పోలీసులు రౌడీ రాజ్యానికి మద్దతు పలుకుతున్నారని, జనసేన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ వీడియోలో ఓ యువకుడు పేర్కొన్నాడు. ఇక ఇప్పడు తమను ఎవరూ అపలేరని అదే యువకుడు పేర్కోనడం వినబడింది. ముందుగా గట్టుకు చేరుకున్న యువకుడు తోటి సహచరుల్ని రండీ రండీ ఇక మనల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ జై జనసేన అంటూ నినదించాడు.

ఈ వీడియోను వీక్షించిన జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ‘నా జన సైనికులు, నా గుండె చప్పుళ్లు’ అంటూ సగర్వంగా ప్రకటించారు. మీరు సమాజానికి సుస్థిరతను తెచ్చే యోధులు... మీకు నా కృతజ్ఞతలు, నేను మీకు రుణగ్రస్తుడిని అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. అయితే సాయంత్రం 6.30 నిమిషాలకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వార ఈ వీడియోను పంచుకోగా అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. రీట్విట్లు, లైకులు, కామెంట్లతో నెట్టింట్లో హోరెత్తిపోతోంది. అరగంట వ్యవధిలోనే ఈ వీడియో ఏకంగా 8వేల పైచిలుకు మంది దీనిని వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles