Air India plane gets stuck under footbridge బ్రడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిరిండియా విమానం

Air india plane gets stuck under foot over bridge near airport

Air India, Air India plane, Viral Story, viral video, Delhi, Delhi Airport, Delhi-Gurgaon Expressway, Delhi-Gurgaon Highway Air India, Air India Plane, Viral Story, Viral Video, Delhi, Delhi Airport, Delhi-Gurgaon Expressway, Delhi-Gurgaon Highway, viral news, viral video, twitter viral, twitter news, viral , viral twitter post

A retired aircraft with the markings of national carrier Air India was caught of cam stuck beneath a footbridge on a read near the Delhi airport. The video of the massive airplane halted on the Delhi-Gurugram highway, with cars zooming past, went viral on social media.

ITEMVIDEOS: ఇరుక్కుపోయిన ఎయిరిండియా విమానం.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 10/04/2021 12:59 PM IST
Air india plane gets stuck under foot over bridge near airport

ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా టాటా సన్స్ చేతిలోకి వెళ్లిందన్న విషయం తెలిసిందే. దాదాపుగా 7 దశాబ్దాల తరువాత మళ్లీ ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో మళ్లీ ఎయిరిండియా విమానాలకు మించి రోజులు రానున్నాయన్న సంకేతాలు కూడా వ్యక్తమవతున్నాయి. ఎయిరిండిమాను ఇక టాటా సన్స్ యాజమాన్యం నిర్వహించనుంది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న తరుణంలోనే ఓ ఎయిర్ ఇండియా విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే దీనిని నెట్టింట్లో పోస్టు చేసిన నెటిజన్ ఇది ఎక్కడ చోటుచేసుకుంది.. ఎప్పుడు చోటుచేసుకుందో చెప్పాలంటూ కాప్షన్ పెట్టాడు. దీనిపై నెటిజనులు కూడా ఆయనకు బదులిచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే కొందరు ఈ వీడియో రెండేళ్ల క్రితానికి చెందినదని అన్నారు. ఇక ఈ ఘటన జరిగిందీ పశ్చిమ బెంగాల్ లోనని చెప్పడంతో.. పాటు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేశారు. అయితే దీనిని కొందరు నెటిజనులు తీవ్రంగా ఖండించారు. ఈ రెండు ఫోటో్లోని విమానాలు, బ్రిడ్జిలు వేర్వేరని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ లో వాహనాలు వెళ్లే బ్రిడ్జి కింత విమానం ఇరక్కుపోగా, ఈ ఫోటోలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద విమానం ఇరుక్కుపోయిందని చెప్పారు. అయితే కొందరు మాత్రం విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పారు. ఈ ఫోటో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనిదని.. ఢిల్లీ-గుర్ గావ్ రహదారిపై ఈ విమానం ఇరుక్కుపోయిందని చెప్పారు. దీంతో పోస్టు పెట్టిన నెటిజనుకు సమాధానం లభించినా.. ఇలా విమానాన్ని తీసుకువెళ్తే.. ఏమైనా జరిగినా.. అందులో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు ఎవరు బాధ్యులు.. అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో ఎయిర్ ఇండియా కంపెనీ ప్రతినిధులు సమాధానాలు చెప్పాల్సి వచ్చింది.

కాగా, ఈ విమానాన్ని సేవల నుంచి తప్పించామని ఎయిర్ ఇండియా తెలిపింది. అంతేకాదు ఈ విమానాన్ని స్క్రాప్ కింద అమ్మేసింది. దీనిని తరలిస్తున్న సమయంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వంతెన కింద ఇరుక్కుపోయింది. విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ విమానాన్ని గతేడాదే సేవల నుంచి తప్పించినట్టు చెప్పారు. విమానాన్ని తుక్కు కింద కొనుక్కున్న వారు శనివారం దాని తరలింపును చేపట్టినట్టు పేర్కొన్నారు. కాబట్టి ఈ విమానంతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  Delhi  Delhi Airport  foot bridge  plane footbridge  Viral Video  Viral video  trending video  

Other Articles