Aryan Khan arrest: NCB likely to seek further custody డ్రగ్స్ కేసులో అర్యన్ ఖాన్ ను కస్టడీకి కోరనున్న ఎన్సీబి

Trouble mounts for aryan khan as ncb likely to seek further custody in drugs case

NCB custody, aryan khan, mumbai cruise drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Bollywood News, Hindi Movies News, aryan khan, sameer wankhede, ncb, Crime

The Narcotics Control Bureau is likely to seek further custody of Shah Rukh Khan's son Aryan Khan for investigation in the Cordelia drugs case. The NCB has said Aryan Khan's custody will be needed to investigate materials found during the overnight raids. The NCB is also going to seek further custody of two other accused in connection with the case.

షారుక్ ఖాన్ తనయుడు అర్యన్ ను కస్టడీకి కోరనున్న ఎన్సీబి

Posted: 10/04/2021 01:53 PM IST
Trouble mounts for aryan khan as ncb likely to seek further custody in drugs case

ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్ లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్న బాలీవుడ్ అగ్రన‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ఎన్సీబి అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి దొరికిపోయిన ఆర్యన్ ఖాన్ ను ఇవాళ ఆదివారం అరెస్టు చేసిన ఎన్సీబి అధికారులు ఆయనను ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హజరు పర్చారు. ఈ క్రమంలో అర్యాన్ ఖాన్ తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబి అధికారులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ పిటీషన్ పై న్యాయస్థానం విచారించనుంది.

అర్యన్ ఖాన్ తో పాటు ఈ కేసులో అరెస్టైయిన మరో ఇద్దరిని కూడా ఎన్సీబి అధికారులు కస్టడీకి కోరుతున్నారు. డ్రగ్స్ కేసులో వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి వుందని అందుచేత వీరిని వారం రోజుల పాటు విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబి అధికారులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్సీబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడ్ తెలిపారు. అయితే అరెస్టు తరువాత విచారణలో నిందితులు ఏం సమాచారాన్ని రాబట్టారు..వారికి డ్రగ్ పెడ్లర్ లతో వున్న లింకులు, ఇతరాత్ర సమాచారాన్ని తాను వెల్లడించలేనని తెలిపారు.

కాగా ఈ కేసులో అరెస్టయిన అర్యన్ ఖాన్ ను తనకు బెయిల్ కావాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కూడా న్యాయస్థానం విచారణ చేయనుంది. ఇదిలావుండగా, ఆదివారం ఉదయం నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచార‌ణ‌లో ఉన్న అర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడ‌ని అధికారులు తెలిపారు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో జ‌రిగిన ఓ రేవ్ పార్టీపై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు అత‌నితో పాటు ప‌లువురు ఇత‌ర ప్ర‌ముఖుల పిల్ల‌ల‌ను కూడా అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఆర్య‌న్‌ను ఎన్సీబీ ప్ర‌శ్నించింది. సాయంత్రం అత‌న్ని అరెస్ట్ చేసింది.

ఈ విచార‌ణ‌లో ఆర్య‌న్ గ‌త నాలుగేళ్ల నుంచి డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు తేలింద‌ని ఎన్సీబీ అధికారులు వెల్ల‌డించారు. అత‌డు యూకే, దుబాయ్‌, ఇత‌ర దేశాల‌లో ఉన్న‌ప్పుడు కూడా డ్ర‌గ్స్ తీసుకుంటూనే ఉండేవాడ‌ని చెప్పారు. మొత్తం 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఈ రేవ్ పార్టీ జ‌రిగింది. ఆర్య‌న్‌తోపాటు అత‌ని స్నేహితుడు అర్బాజ్‌, మ‌రో ఆరుగురిని ఎన్సీబీ సాయంత్రం అరెస్ట్ చేసి వైద్య ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించింది. ఆర్య‌న్‌పై సెక్ష‌న్ 27 (నార్కోటిక్ డ్ర‌గ్ వినియోగించినందుకు శిక్ష‌), 8సీ (డ్ర‌గ్స్ త‌యారీ, ఉత్ప‌త్తి, క‌లిగి ఉండ‌టం, అమ్మ‌డం లేదా కొన‌డం)తోపాటు పలు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles