Taliban requests India to resume flight operations భారత సర్కారుకు తాలిబన్ల లేఖ.. ఎందుకో తెలుసా.?

Taliban govt writes letter to india s dgca to resume its commercial flights

Afghanistan India flights, India flights to Afghanistan, Kabul flights, Taliban, Delhi Kabul flights, Afghanistan, Taliban official letter to Indian govt, Afghanistan, Taliban, letter, Indian Govt, Delhi airport, Flights, Kabul airport, DGCA, Kam Air, Ariana, Afghtan airlines, Delhi

The Afghanistan Civil Aviation Authority under the new Taliban regime has written to India’s Directorate General of Civil Aviation (DGCA) seeking resumption of flights operated by its airlines Kam Air and Ariana Afghan Airline to and from Delhi.

భారత సర్కారుకు తాలిబన్ల లేఖ.. ఎప్పుడు రాశారో తెలుసా.?

Posted: 09/29/2021 04:58 PM IST
Taliban govt writes letter to india s dgca to resume its commercial flights

ఆఫ్ఘ‌నిస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు భారత ప్రభుత్వానికి తొలిసారిగా.. అధికారికంగా లేఖను రాశారు. ఈ లేఖలో వారు వినమ్రపూర్వకంగా భారత సర్కురుకు విన్పపాన్ని వినిపించారు. భారత్ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇదివరకే స్పష్టం చేసిన తాలిబన్లు.. కాశ్మీర్ అంశంలో మాత్రం మాటమార్చిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశంలో భారత్- పాకిస్థాన్ దేశాలు పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే కాశ్మీర్ లోని ముస్తింల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత తమపై వుందని అన్నారు.

తాలిబన్లు రెండు నాల్కల ధోరణితో అప్రమత్తంగా ఉన్న భారత పరిస్థితుల్ని నిషితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖపై దృష్టి సారించింది. ఈ లేఖలో భారత్- అప్ఘనిస్తాన్ దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆ లేఖ‌లో తాలిబ‌న్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ పేరుతో ఈ లేఖ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ అరుణ్ కుమార్‌కు తాలిబ‌న్లు ఈ లేఖ‌ను పంపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హ‌మీదుల్లా అకున్‌జ‌దా ఈ లేఖ‌ను రాశారు. కాగా ఈ లేఖను సెప్టెంబ‌ర్ 7వ తేదీన ఈ లేఖ రాసిన‌ట్లుగా తేదీ వేయబడివుంది.

అమెరికా బ‌ల‌గాలు తిరిగి వెళ్లిపోయే స‌మ‌యంలో కాబూల్ విమానాశ్రయాన్ని దెబ్బ‌తీశారని... అయితే ఖ‌తార్ సాంకేతిక సాయంతో దానిని పున‌రుద్ధ‌రించామని పేర్కోన్నారు. ఈ ఘటనలో ఈ నెల 6న ఎయిర్ మెన్ కు నోటీసు జారీచేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇండియా, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నామని హ‌మీదుల్లా పేరున ఈ లేఖ రాశారు. రెండు దేశాల మ‌ధ్య ప్ర‌యాణం సాఫీగా సాగాల‌న్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నామని పేర్కోన్నా. మా అధికారిక ఎయిర్ లైన్స్ అరియానా ఆఫ్ఘ‌న్‌, కామ్ ఎయిర్ త‌మ విమానాల‌ను తిరిగి ప్రారంభించాల‌ని అనుకుంటున్నాయి. వాణిజ్య విమానాలు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నాము అని ఆ లేఖ‌లో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Taliban  letter  Indian Govt  Delhi airport  Flights  Kabul airport  DGCA  Kam Air  Ariana  Afghtan airlines  Delhi  

Other Articles