Amarinder on Sidhu's resignation as PCC chief సిద్దూ రాజీనామాపై వెంటనే స్పందించిన కెప్టెన్

He is not a stable man amarinder on sidhu s resignation as pcc chief

Navjot Singh Sidhu, Sonia Gandhi, former Punjab Chief Minister, Amarinder Singh, Punjab PCC Post, Charanjit Singh Channi, Congress, Punjab, Politics

Soon after the resignation of Navjot Singh Sidhu as the Punjab Congress president, former chief minister Amarinder Singh on Tuesday dubbed the cricketer-turned-politician as a man who is "not stable" and "not fit" for the border state.

పిసిసి పదవికి సిద్దూ రాజీనామాపై వెంటనే స్పందించిన కెప్టెన్

Posted: 09/28/2021 08:45 PM IST
He is not a stable man amarinder on sidhu s resignation as pcc chief

పంజాబ్ లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో ఇన్నాళ్లు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్ర కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి ఇటీవల రాజీనామా చేసి.. ఇవాళ బీజేపి తీర్థం తీసుకోనున్నారని, ఆయనకు కేంద్రంలోని పెద్దలు కేంద్రమంత్రి పదవిని ఇస్తామని కూడా హామీని ఇచ్చారని తెలుస్తోంది. కాగా రెండు నెలల క్రితం పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.

కాగా, అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వేళ కూడా సిధ్దూ.. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్‌ సింగ్ ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని అరోపించారు. స్వపక్షానికి చెందిన నేతలపైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తారని అమరీందర్‌ సింగ్‌పై మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్‌ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం పట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. అయితే పార్టీ పిసీసీ పదవికి రాజీనామా చేసినా.. తాను కాంగ్రెస్ పార్టీలోనే కోనసాగుతానని పేర్కోన్నారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప‌ద‌వికి సిద్దూ రాజీనామా చేయ‌డంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్దూ రాజీనామా లేఖ‌ను సోనియాకు పంపిన వెంట‌నే.. అమ‌రీంద‌ర్ దీనిపై ట్వీట్ చేశారు. తాను ముందునుంచే చెబుతూ వస్తున్నాను. సిద్దూ ఓ నిల‌క‌డ లేని వ్య‌క్తి. పంజాబ్‌ లాంటి స‌రిహ‌ద్దు రాష్ట్రానికి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే నేత కావాలి. కానీ అందుకు సిద్దూ ప‌నికి రాడు అని అమ‌రీంద‌ర్ ఆ ట్వీట్‌లో పేర్కోన్నారు. ఈ ఏడాది జులైలోనే పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వి చేప‌ట్టిన సిద్దూ.. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఆ ప‌ద‌విని వ‌దులుకోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర భ‌విష్య‌త్తులో రాజీ ప‌డ‌బోన‌ని సోనియాకు రాసిన లేఖ‌లో సిద్దూ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles