Bhopal constatble held for filming women officer during shower మహిళా పోలీసు అధికారి బాత్రూమ్ లో స్పై కెమెరా..

Bhopal policewoman s driver booked for filming her during shower and blackmail

Bhopal woman police officer, shower, Bhopal, car driver, filming video, cell phone, phone recodings, extortion, blackmail, Madhya Pradesh, crime news

The Bhopal Police’s crime branch has registered a case against a police constable for allegedly filming a policewoman while she was in the shower and then trying to blackmail her for money. The accused constable was posted as a driver to the complainant policewoman.

మహిళా పోలీసు అధికారి బాత్రూమ్ లో స్పై కెమెరా.. ఆపై బ్లాక్ మెయిల్..

Posted: 09/28/2021 03:49 PM IST
Bhopal policewoman s driver booked for filming her during shower and blackmail

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిమూచ్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ పై ముగ్గరు అగంతకులు సామూహిక అత్యాచారం జరిపి ఆపై లైంగిక దాడిని వీడియో తీసి.. ఈ ఘటనపై ఎవరికైన చెబితే చంపుతామని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి బ్రతూమ్ లో స్పై కెమెరాను పెట్టి వేధించిన ఘటన కూడా మధ్యప్రదేశ్‌లోనే వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్ లోనే వెలుగు చూడటం కలకలం రేపుతోంది.

కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని సదరు మహిలా పోలీసు అధికారి ఆమె డ్రైవర్‌ గా నియమించుకోగా.. తన ఉన్నతాధికారి అన్న కనీస ఇంకితాన్ని మర్చిపోయి.. అమెనే బ్లాక్ మెయిల్ చేశాడు. అమె ఇంట్లోని బాత్రూమ్‌లో వీడియో మోడ్ అన్ చేసిన సెల్ ఫోన్ కెమెరా పెట్టి వసూళ్లకు తెరలేపాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ పోలీస్‌ అధికారిణికి డ్రైవర్ గా ఓ కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22న అధికారి ఇంట్లోకి వెళ్లిన కానిస్టేబుల్‌.. ఆమె బాత్రూమ్‌ తలుపుపై వీడియో రికార్డింగ్‌ ఆన్‌ చేసి సెల్‌ఫోన్‌ ఉంచాడు.

స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్‌ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్‌ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీస్‌ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, ‍క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles