Pakistani terrorist caught alive in Uri of Jammu and Kashmir భారత బలగాలకు మరోమారు ప్రాణాలతో పట్టు పాక్ ఉగ్రవాది.!

Indian army caught pakistani terrorist alive in uri sector of jammu and kashmir

Pakistan terrorist, Indian Army, terrorist caught alive, terrorists infiltration, infiltration, Uri Sector, line of control, jammu and kashmir, Crime

Army sources quoted by media say that a Pakistani terrorist was caught alive during operations in Jammu and Kashmir's Uri along the line of control on Monday. Army sources said one terrorist was killed and one caught alive during the operations.

భారత బలగాలకు మరోమారు ప్రాణాలతో పట్టు పాక్ ఉగ్రవాది.!

Posted: 09/28/2021 01:12 PM IST
Indian army caught pakistani terrorist alive in uri sector of jammu and kashmir

భారత భూబాగంలోకి చోరబడేందుకు అక్రమంగా వస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత సైన్యం మరోసారి భగ్నం చేసింది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లోని ఉరి సెక్టార్‌ల్లో చోరబాటు యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదిన భారత బలగాలు సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. చాలా ఏళ్ల తరువాత ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎస్ బలగాలు పాకిస్థాన్ ఉగ్రవాదిని సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. భారత భూబాగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ చొరబాటుదారుల ప్రయత్నాలపై భారత ఆర్మీ నీళ్లు చల్లింది. అక్రమంగా దేశంలోకి చోరబాడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై ఇండియన్ అర్మీ బలగాలు కాల్పులు జరపడంతో కొందరు పారిపోగా ఒకరు మరణించారు. మరోకరు సజీవంగా పట్టుబడ్డాడు.

గత ఐదు రోజుల వ్యవధిలో అక్రమంగా భారత భూబాగంలోకి చోరబడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు నలుగురు ప్రాణాలను కోల్పోయారు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదలు దేశంలోకి అక్రమంగా చోరబడేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. జమ్మూకాశ్మీర్ లో శాంతి,సామరస్యతకు విఘాతం కలిగిస్తూ.. మతవిధ్వేషాలను కూడా రెచ్చగోట్టేందుకు ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తూనే వున్నారు. కాగా ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ పై ఆర్మీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్ 18 నుండి ఉరి సెక్టార్‌లో నిరంతర చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

ఈ నెల 23న భారత బలగాలు అడ్డుకుని కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు మరణించారు. కాగా కాల్పులతో అప్రమత్తమైన మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. గత కొంతకాలంగా ఇద్దరి కోసం అన్వేషణ జరుగుతోంది. భారత ఆర్మీ జవాన్లు కూడా సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌ జరిపారు, జమ్మూకాశ్మీర్ లోని విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా, పాకిస్తాన్ సైన్యం నిరంతరం అలాంటి ప్రయత్నాలలో నిమగ్నమై ఉందని వారు అరోపిస్తున్నారు. గత కొంతకాలంగా చోరబాట్లు తగ్గముఖం పట్టినా గత నెల రోజుల నుంచి అధికమయ్యాయని అధికారులు తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles