సాధారణంగా మన దగ్గర స్పైడర్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. అయినా వాటిని చూసి జంకుతుంటాం. ఇంటి వాసరాలకు చివర్లో గూడు కట్టుకునే పనిలో అవి నిమగ్నం అవుతుంటాయి. దోమలు, ఇతర కీటకాలు ఈ గూడులో చిక్కకుని శల్యమైన తరువాత వాటిని ఇవి ఆరగించి జీవిస్తుంటాయి. మన దేశంలో అత్యంత ఎక్కువగా పాడుబడిన ఇండ్లలో అవి నివాసం ఉంటాయి. వాటిని మనం సాలీడు అంటాం. లేదా సాలెపురుగు అని కూడా అంటాం. ఇవి విషపూరితమైనవని చాలా మందికి తెలియదు. అవి కట్టే గూడు కూడా విషపూరితమైనదే.
సాలీడు గూడు కట్టే పోరలు కూడా విషపూరితమైనవేనన్న విషయం ఎంత మందికి తెలుసు. ఇవి ఆహారంలో పడితే ఆ వంటకాలను పడేస్తారు. ఎందుకంటే ఇవి కూడా ప్రాణాలను హరించేలా విషపూరితమైన రసాయనాలను వదిలి మరీ మరణిస్తాయి. ఇక వీటిలోచాలా రకాల జాతులు ఉంటాయి. అయితే అన్ని విషపూరితమైనవే అయితే కొన్ని భారీగా వున్నా వాటి పోరలను స్మృశించినప్పుడో లేక అవి ఆహార పదార్థాలపై పడినప్పుడో మాత్రమే ప్రమాదకరం కాగా, మరికోన్ని మాత్రం విషపూరితమైని దానికి తోడు ప్రమాదకరమైనవి కూడా. వాటిని ముట్టుకోవాల్సిన పనిలేకుండా అవి ఎవరిపై పడినా అవి కాటు వేస్తాయి.
అటువంటి ప్రమాదకరమైన జాతుల్లో టారంటులా అనే జాతికి చెందిన స్పైడర్ ఒకటి. ఇవి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తాయి. ఆ స్పైడర్‌తో ఓ చిన్నారి ఆటలాడింది. అది ప్రమాదకరమైన స్పైడర్ అని తెలియక.. ఆ చిన్నారి దానితో ఆటలు ఆడుతుండగా.. అది తిన్నగా ఆ చిన్నారి భుజాల మీదికి ఎక్కింది. ఈ విషయాన్ని గమనించిన ఆ పాప తండ్రి వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకొని… ఆ స్పైడర్‌ను అక్కడి నుంచి తరిమేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more