Bihar daily Wager gets Rs 9.99 crore కూలీ పేరున బ్యాంకు ఖాతా.. అందులో రూ.9.99 కోట్లు

Daily wager in bihar gets rs 9 99 cr in his bank account

daily wager, Vipin Chauhan, Aadhaar Number, Rs 9.99 Crore, Bank account, Union Bank of India, customer service point (CSP) outlet, job card, MGNREGA, savings account, savings account, Supaul branch. Bihar, Crime

After a series of cases where poor villagers have received crores of rupees in their bank accounts, a daily wager learnt that he was having Rs 9.99 crore in the Union Bank of India, Supaul branch. Interestingly, the labourer named Vipin Chauhan claims that he never opened an account in any bank.

కూలీ పేరున బ్యాంకు ఖాతా.. అందులో రూ.9.99 కోట్లు

Posted: 09/24/2021 07:48 PM IST
Daily wager in bihar gets rs 9 99 cr in his bank account

పేదలకు చెందిన బ్యాంకు ఖాతాలలో కోట్లాది రూపాయలు జమ అవుతున్న వరుస ఘటనలు బీహార్ రాష్ట్రంలో వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏ బ్యాంకు అకౌంటు లేని ఓ దినసరి కూలీ ఖాతాలోనూ కోట్లాది రూపాయలు జమకావడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా కూడా లేని దినసరి కూలి పేరున బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ తెరచి అందులో రమారమి పది కోట్ల రూపాయలను వేయడం బీహార్ రాష్ట్రంలోని పెను సంచలనంగా మారింది. తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచి వుందని, అందులో ఏకంగా రూ.9.99 కోట్లు వున్నాయని తెలిసి కూలీ విస్తుపోయాడు.

కరోనా మహమ్మారి కారణంగా ఇంతకు ముందులా కూలీ పనులు రోజు లభించకపోవడంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం కింద తన పేరును నమోదు చేసుకోవడం కోసం వెళ్లి.. తన పేరున జాబ్ కార్డు తీసుకునేందుకు వెళ్లాడు. ఉపాధి హామీ పనుల డబ్బులు నేరుగా తమ ఖాతాలోకి వస్తాయని తెలియడంతో ఆయన చేసేది లేక తన పేరున బ్యాంకు అకౌంట్ తీసేందుకు యూనియర్ బ్యాంక్ అఫ్ ఇండియా సుపాల్ బ్రాంచికి చెందిన కస్టమర్ ఔట్ లెట్ పాయింట్ కు వెళ్లాడు. అక్కడ అతని ఆదార్ నెంబరుపై సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వుందని, అందులో దాదాపుగా పది కోట్ల రూపాయలు వున్నాయని తెలిసింది. దీంతో తాను అసలు బ్యాంక్ ఖాతను తెరవలేదని దినసరి కూలి అయిన విపిన్ చౌహాన్ పేర్కొన్నాడు.

కాగా ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాను, అధికారులు ఖాతా వివరాలను తనిఖీ చేసారు. ఇది అక్టోబర్ 13, 2016 న తెరవబడిందని, కాగా ఫిబ్రవరి 2017 లో కోట్లాది రూపాయల లావాదేవీ తన ఖాతాలో జరిగిందని అన్నాడు. అయితే ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారి తన ఫోటోను, వేలిముద్రను, సంతకాలను తనవి కావని, అయితే ఆధార్ కార్డు మాత్రమే తనదని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం రూ. 9.99 కోట్లు ఇప్పటికీ ఖాతాలోనే ఉన్నాయి "అని చౌహాన్ చెప్పారు. దీంతో బ్యాంక్ అధికారులు అకౌంట్ లోని డబ్బును హోల్డ్ లో పెట్టారుచ

బీహార్‌లో ఇలా డబ్బులు తమ ఖాతాల్లోకి వచ్చి పడటం ఇది కొత్త అంశమేమి కాదు. బీహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని కాట్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారి గ్రామానికి చెందిన రాం బహదూర్ షా బ్యాంక్ ఖాతాలో రూ .52 కోట్లు వచ్చి చేరాయి. అంతకుముందు ఇదే రాష్ట్రంలో 6 వ తరగతికి చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు - ఆశిష్ కుమార్,   గురుచరణ్ బిశ్వాస్ ల ఖాతాల్లో సెప్టెంబర్ 15 న వరుసగా రూ .6,20,11,100, రూ .90,52,21,223 వచ్చి పడిన విషయం తెలిసిందే. ఇక రంజిత్ దాస్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ .5.5 లక్షలు రాగా, వాటిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles