Jagga Reddy fires on pcc chief Revanth Reddy పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి

Is this congress party or pvt limited company jaggareddy fires on tpcc

Jagga Reddy fires on pcc chief, Jaggareddy slams Revanth reddy, jagga reddy fires on revanth reddy, Jaggareddy on PCC chief, turpu Jayaprakash Reddy, Revanth Reddy, Geetha Reddy, Zaheerabad tour, Sangareddy, personal image, party cadre, Congress, Telangana, Politics

Congress MLA T Jayaprakash Reddy on Friday expressed his displeasure over the working style of PCC Chief Revantha Reddy. He alleged Revanth Reddy has not given him information on his visit to Zaheerabad of Sangareddy district. Not obly to him but even Zaheerabad former MLA Geeta Reddy was also not aware of his Programme. He suggested one man show in congress will never workout. It also may harm the Party.

‘‘కాంగ్రెస్ పార్టీలో నీకన్న తోపులున్నారు’’: రేవంత్ రెడ్డికీ జగ్గారెడ్డి చురక

Posted: 09/24/2021 05:40 PM IST
Is this congress party or pvt limited company jaggareddy fires on tpcc

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో మరోసారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ ముఖ్యనేత‌ల వ‌ద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో సింగిల్ హీరో భావజాలం కుదరదని ఆయన తేల్చిచెప్పారు. ఈ తరహా వ్యవహారశైలితో పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఒక్కరిని స్టార్ గా మార్చే క్రమంలో మిగతావారిని తోక్కేయడం సముచితం కాదని ఆయన సూచించారు. సింగిల్ హీరో భావజాలం చూపించడానికి ఇది కాంగ్రస్ పార్టీ అని.. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదని ఆయన చురకలంటించారు.

పార్టీ నేత‌ల‌తో చర్చించకుండానే కార్య‌క్ర‌మాలు ఖ‌రారు చేసుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేసుకుని ఆ తరువాత వాటిని పార్టీ నేతలతో చర్చించడంలో ఆంతర్యమేమిటని ఆయన రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరే తోపు అనుకుంటే పోరబాటని, ఎందరో తోపులు వున్నారని, ఆ విషయానికి వస్తే రేవంత్ కన్నా తానే పెద్ద తోపునని జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇ‍వ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్‌ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు.  జగ్గారెడ్డికి , రేవంత్‌ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు.

రేవంత్ రెడ్డి జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు క‌నీసం గీతారెడ్డికి కూడా స‌మాచారం లేదని, వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికే ఆరాట‌ప‌డితే పార్టీలో కుద‌ర‌దని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. సంగారెడ్డి జిల్లాకు వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని, విభేదాలు ఉన్నాయ‌ని చెప్పేందుకు స‌మాచారం ఇవ్వ‌ట్లేదా? అని ఆయ‌న నిల‌దీశారు. పార్టీలో సింగిల్‌ హీరోగా ఉండాల‌నుకుంటే కుదరదని చెప్పారు. ఈ రాష్ట్రంలో తనకు అభిమానులున్నారని.. కావాలంటే పార్టీ సపోర్ట్‌ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles