"Rookie" The Dog Interrupts Baseball Game ఉత్సాహం ఆపుకోలేక బేస్ బాల్ మధ్యలోకి వెళ్లిన రూకీ

Viral video rookie the dog interrupts baseball game no one s complaining

Minor League Baseball, Dog, Buffalo, golden retriever, Buffalo Bisons, Lehigh Valley IronPigs, Rookie New York, America, Viral videos

It's all fun and games until a dog steals the show. This stunning yet adorable situation was witnessed by the audience at a Minor League Baseball game held in Buffalo, New York. The video of a golden retriever named Rookie is going viral on the Internet for all the right reasons.

ITEMVIDEOS: ఉత్సాహం ఆపుకోలేక బేస్ బాల్ మధ్యలోకి వెళ్లిన రూకీ

Posted: 09/24/2021 03:59 PM IST
Viral video rookie the dog interrupts baseball game no one s complaining

శనకాలకు ఆటలకు చాలా దగ్గరి సంబంధం వుంది. అవి తమ యజమానులతో కలసి ఆటలు ఆడాలని నిత్యం వేచిచూస్తుంటాయి. ఈ క్రమంలో తమ యజమానులకు దెబ్బలు తగలడానికి కూడా కారణమౌతుంటాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఇప్పటికే మనం చేశాం. అయితే కుక్కలకు గ్రౌండ్ లో గేమ్స్ ఆడాలని ఎందుకు అంత ఉబలాటమో తెలియదు కానీ ఇటీవల మహిళల టీ-20 మ్యాచ్ మధ్యలోకి వెళ్లి బంతిని తన నోట కరుచుకుని వెళ్లిన శునకం గుర్తుందిగా.. నేరుగా వెళ్లి రన్నర్ బ్యాట్స్ ఉమెన్ చేతికి బంతిని అందించింది.

సరిగ్గా అదే మాదిరిగా న్యూయార్క్ లోని బఫెలోలో జరిగిన మైనర్ లీగ్ బేస్ బాల్ ఆటలో మరో శునకం కూడా ఆటకు అంతరాయం కలిగించింది. అయితే ఆకస్మాత్తుగా ఆట మధ్యలో రూకీ అనే శునకం రావడంతో మ్యాచ్ ఆగినా నవ్వుల పువ్వులు వెల్లివిపిరాయి. దీంతో అద్భుతమైన వాతావరణం అలుముకుంది. రూకీ అనే గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజనులు ఈ వీడియోపై కామెంట్లు, లైకుల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు తమ అకౌంట్లలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇంతకీ న్యూయార్క్ లో ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. భపెలో లోని ఓ క్రీడామైదానంలో బఫెలో బైసన్స్ కు..  లేహీ వ్యాలీ ఐరన్‌పిగ్స్ మధ్య గేమ్ జరుగుతుండగా ఈ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. ట్రెంటన్ థండర్ కోసం గబ్బిలాలు తీసుకురావడానికి రూకీని అక్కడి అధికారులు నియమించారు. అయితే గబ్బిలాలు లేకపోవడంతో రూకీ.. బఫెలో బేస్ బాల్ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతేకాదు బఫెలోలో నిర్వహించిన "డాగ్ డే" కోసం ఉత్సాహాన్ని కలిగివున్నాడని నెటిజనులు కామెంట్లు పెట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియోను మైనర్ లీగ్ బేస్‌బాల్ ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ 23-సెకన్ల వీడియోలో తొలిసారిగా కుక్క మైదానంలోకి దూసుకెళ్లి, కొద్దిసేపు ఆటను నిలిపివేసింది. పక్కకి తిరిగి వచ్చే ముందు రూకీ సంతోషంగా గడ్డి మీద ఎగరడం మనం చూడవచ్చు. బఫెలో బైసన్స్‌తో రూకీ "తన సహెలెన్ ఫీల్డ్ అరంగేట్రం సమయంలో కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు" అనే శీర్షికతో వారు ఈ వీడియోను పోస్టు చేశారు. ఆటకు ఆటంకం కలిగించినా "మేము ఇంకా అతన్ని ప్రేమిస్తున్నాము" అంటూ ట్రెంటన్ థండర్ ను కూడా మైనర్ లీగ్ బేస్ బాల్ ట్యాగ్ చేసింది. ఈ వీడియో 5 లక్షలకు పైగా వీక్షణలను మరియు 5,000 కంటే ఎక్కువ 'లైక్‌లను' సంపాదించింది. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh