Woman slips while trying to board moving train ప్రయాణికుల అప్రమత్తతో నిలిచిన మహిళ ప్రాణం

Mumbai woman slips trying to board moving train at vasai road railway station

viral video, train video, rescue video, mumbai train, Vasai Road Railway station, CCTV footage, Twitter, mumbai train, mumbai railway station, twitter viral video

In a shocking incident, a female passenger was saved by fellow passengers in the nick of time at Mumbai’s Vasai Road Railway Junction. A CCTV footage of the incident was shared on Twitter that is now going swiftly viral. Many netizens praised the onlookers for being prompt.

ITEMVIDEOS: యమగండం తప్పింది.. ప్రయాణికుల అప్రమత్తతో నిలిచిన ప్రాణం

Posted: 09/21/2021 03:58 PM IST
Mumbai woman slips trying to board moving train at vasai road railway station

నూకలు మిగిలేవున్నాయి.. అన్న మాట ఈ మ‌హిళ విషయంలో చెప్పుకోకతప్పదు. అంటే దానర్థం అమెకు మరణం అంచుల వరకు వెళ్లివచ్చింది. తిరిగి రావడానికి కారణం అమెకు ఈ భూమ్మిద ఇంకా నూకలు వున్నాయనే. ఇంతలా చెబుతున్నారేంటి.. ఎంతటి ఆపదలో వున్నవారినైనా ఇలా అంటారా.? అంటే సందర్భోచితంగా అన్న మాటలే తప్ప.. మహిళ గురించి చేసిన వ్యాఖ్యలు కావని అర్థం చేసుకోవాలి. అంతలా ఏంజరిగిందని అంటారా.? ఈ మహిళ కదులుతున్న రైలు ఎక్కబోయి జారి కిందపడింది. అయితే తొటి ప్రయాణికులు అప్రమత్తం కావడంతో అమె ప్రాణాలతో నిలిచింది.

ఇందుకు సంబంధించిన మ‌హిళ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజనులు తోటి ప్రయాణికుల అప్రమత్తతను శ్లాఘిస్తూనే.. మహిళను తీరును మాత్రం అక్షేపించారు. రైలు వేగంగా కదులుతున్నా దానిని అందుకోవాలని ప్రయత్నించడం అవివేకమని కామెంట్లు చేశారు. రైలు కోసం ముందుకు వచ్చిన వారు కదులుతున్న రైలును చూసి రన్నింగ్ రైలు ఎక్కేబదులు.. ఆ రైలు ఆగివున్నప్పుడే ఏదో ఒక బోగిలో ఎక్కివుండుంటే ప్రమాదం తప్పేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కదులుతున్న రైలును ఎక్కడం ఎంత ప్రమాదమో ఇప్పుటికే అనేక వీడియోల్లో చూసినా ప్రయాణికులు మారడంలేదంటూ మరికోందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని వాస‌యి రోడ్డు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద రైలు ఎక్కేందుకు ఇద్దరు మ‌హిళలు వ‌చ్చారు. అయితే, రైలు ఆగి ఉన్న స‌మ‌యంలో  అందుకోలేక‌పోయిన అమె అది కాస్తా క‌దులుతుండ‌గా ప‌రుగున అక్క‌డ‌కు వ‌చ్చి రైలు ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించారు. అందులో ఒక మహిళ రైలును అందుకునేందుకు ప్రయత్నించి జారి రైలు కింద ప‌డ‌బోయింది. వెంట‌నే అక్క‌డ ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను ప్లాట్ ఫాం పైకి లాగాడు. అమె కాలుకు రైలు తగిలింది. అది గమనించిన మిగతా ప్రయాణికులు అక్కడకు చటుక్కున వచ్చి అమెను మరింతగా ఫ్లాట్ ఫాం పైకి లాగారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ముంబై రైల్వే స్టేష‌న్‌లో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles