COVID-19 is evolving as an airborne virus గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్లు

Covid 19 is evolving getting better at becoming an airborne virus

Covid 19, airborne coronavirus, tight-fitting mask, cloth mask, better ventilation, air borne disease, air borne transmission, Alpha variant, Delta variant, Maryland School of Public Health, University of Maryland, study, coronavirus, covid-19

COVID-19 variants are much more adept at airborne transmission than the original version of the coronavirus, according to a new study. University of Maryland researchers analyzed the Alpha variant first identified in the United Kingdom and discovered that carriers breathe out 43 to 100 times more infectious viral aerosols than those infected with the original strain.

గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్లు: అధ్యయనం

Posted: 09/20/2021 08:42 PM IST
Covid 19 is evolving getting better at becoming an airborne virus

కరోనా మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయ. అంతకంతకూ రూపాంతరం చెందుతున్న వైరస్ పలు చోట్ల పలు వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తొంది. ఎటు నుంచి ఏ రకమైన కరోనా తమను ప్రభావితం చేస్తోందోనని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

తొలిగా ప్రపంచంలో విజృంభించిన కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్తగా వస్తున్న వేరియంట్లు గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఒరిజినల్ కరోనా సోకిన వారితో పోలిస్తే ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరి ద్వారా 43 నుంచి 100 రెట్లు అధికంగా వైరస్ క్రిములు గాల్లో ప్రవేశిస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు. డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోందంటే ఇది సోకిన వారి నుంచి గాల్లోకి మరింత ఎక్కువ వైరస్ చేరుతున్నట్లేనని అంటున్నారు. కరోనా పేషెంట్లు వదులుగా ఉండే మాస్కులు, సర్జికల్ మాస్కులు ధరించడం వల్ల వారి నిశ్వాసలో ఉండే కరోనా క్రిముల్లో 50 శాతం మాత్రాన్ని అవి నిరోధిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.

కరోనా సోకిన వారు టైట్‌గా ఉండే మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తిని మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు ఇలా మాస్కులు ధరించడం, ఇళ్లలో వెంటిలేషన్ సదుపాయం సక్రమంగా ఉండేలా చూసుకోవడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని అన్నారు. ”గాలి ద్వారా సంక్రమించేలా కరోనా రూపాంతరం చెందుతోంది. కొత్త వేరియంట్లు క్రమంగా గాలి ద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్‌ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వీటితో పాటు వాకీన్లను తీసుకుంటూ కరోనా నుంచి రక్షణ పోందవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ 2వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్ తో అంతకంతకూ మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌గా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles