Girl climbs up wall like Spider-Man in viral video ‘స్పైడర్ గాళ్’: సునాయాసంగా ఇంటి గోడలు ఎక్కేస్తున్న చిన్నారి

Spidergirl 5 year old climbs wall like spiderman netizens are shocked

girl climbs wall like spider man, girl climbs wall like spiderman, spidergirl, spiderman, girl climbs walls, walll climbing, weird talent, trending video, Girl, Stunt, Talent, wall, spider girl, viral video, viral news, trending news today

A video of a girl climbing a wall like a spider has gone viral on social media and has left netizens in shock. The little girl, aged five, in the video, is seen climbing a wall effortlessly, in minutes, without any help or support.

ITEMVIDEOS: ‘స్పైడర్ గాళ్’: సునాయాసంగా ఇంటి గోడలు ఎక్కేస్తున్న చిన్నారి

Posted: 09/18/2021 08:05 PM IST
Spidergirl 5 year old climbs wall like spiderman netizens are shocked

స్పైడ‌ర్ మ్యాన్ అంటే పిల్ల‌ల‌కు చాలా ఇష్టం. స్పైడ‌ర్ మ్యాన్ చ‌క‌చ‌కా గోడ‌లు ఎక్కేస్తాడు. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీద‌కు దూకేస్తాడు. బిల్డింగ్‌ల మీది నుంచి కింద‌కు దూకుతాడు. ఇలా.. స్పైడ‌ర్‌మ్యాన్ చేసే స్టంట్స్ పిల్ల‌ల‌కు బాగా న‌చ్చుతాయి. అందుకే నీకు ఎవ‌రు ఇష్టం అని పిల్ల‌ల‌ను అడిగి చూడండి.. స్పైడ‌ర్‌మ్యాన్ అని చెబుతారు. నిజానికి స్పైడర్ మ్యాన్ లేకపోయినా.. కొందరు మాత్రం తాము ఆ కోవకు చెందిన వారిమే అంటూ ఏకంగా బహుళ అంతస్థుల బిల్డింగులు ఎక్కేసి.. నిరూపించుకున్నారు.

అయితే స్పైడ‌ర్ మ్యాన్ ను ఆద‌ర్శంగా తీసుకుందో లేక బిల్డింగులు ఎక్కేవారిని తీక్షణంగా పరిశీలించిందో ఏమో కానీ.. ఈ బాలిక కూడా తాను స్పైడర్ మ్యాన్ వారసురాలినేనని అంటోంది. అలా ఎందుకని అంటే.. మీరే చూడండి.. స్పైడ‌ర్‌మ్యాన్‌లా చ‌క‌చ‌కా ఇంట్లోని గోడ‌ను ఎక్కేసింది. ఎటువంటి స‌పోర్ట్ లేకుండా.. కేవ‌లం త‌న కాళ్లు, చేతుల‌తో ఆ బాలిక చేసిన స్టంట్ వీడియోను చూసి నెటిజ‌న్లు అయితే ముక్కున వేలేసుకుంటున్నారు. స్పైడ‌ర్‌మ్యాన్ కూతురిలా ఉన్నావు నువ్వు.. కానీ.. అలా ఎలా సాధ్యం అయింది.. అంటూ చాలామంది నెటిజ‌న్లు నెత్తిగోక్కుంటున్నారు. ఆ వీడియో మాత్రం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh