Bihar farmer receives Rs 52 cr in his account ఈ రైతు అకౌంట్లో డబ్బే డబ్బు.. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు..

Bihar farmer turns crorepati with rs 52 crore in bank account

Bihar farmer turns crorepati, farmer receives Rs 52 crore, bihar farmer pension account, farmer appeals to government, farmer request to leave some amount, Bihar farmer, Rs 52 crore, pension account, elderly farmer, Bihar, Ram Bahadur Shah, Muzaffarpur, farmer's pension account, Bihar

An elderly man from Bihar found himself in a similar situation when he received over Rs 52 crore in his pension account. Ram Bahadur Shah, who hails from a village under the Katihar police station area in the Muzaffarpur district, jumped out of his skin when a Customer Service Point (CSP) official told him that he had more than Rs 52 crore credited to his account.

ఈ రైతు అకౌంట్లో డబ్బే డబ్బు.. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు..

Posted: 09/18/2021 01:23 PM IST
Bihar farmer turns crorepati with rs 52 crore in bank account

బీహార్‌లో సామాన్యుల ఖాతాలు కోట్ల రూపాయలతో నిండిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ, అకస్మాత్తుగా అంతంత డబ్బు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత  సొమ్ము తమది కాదని తెలిసి నిరుత్సాహానికి గురవుతున్నారు. కతిహార్ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో మొన్న రూ. 960 కోట్లు జమకావడం హాట్ టాపిక్ గా మారగా.. ఒక్కసారిగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు ఇప్పటికీ మిస్టరీగానే వున్నాయి.

ఇక తాజాగా ముజఫరాపూర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. కతిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా రైతు. పింఛను ఖాతాకు ఆధార్ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లిన ఆయన యథాలాపంగా తన ఖాతాలో ఎంత ఉందో చెప్పాలని బ్యాంకు అధికారులను కోరాడు. వృద్దుడి ఖాతాను చెక్ చేసిన అధికారులు తొలుత నోరెళ్లబెట్టగా, విషయం తెలిసి వృద్ధుడు షాకయ్యాడు. అతడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు ఉండడమే అందుకు కారణం. ఇది విన్న రైతు ఇంతమొత్తం తన ఖాతాలో ఉందనగానే తనకు నోట మాట కూడా రాలేదని అన్నాడు.

ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్న ఆయన.. మరీ అంత సొమ్ము వద్దు కానీ, ఎంతో కొంత ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టాలని బహదూర్ షా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మరోవైపు, బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు వాటిని డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, బీహార్‌కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల రూ. 5.5 లక్షలు పడగా బ్యాంకు అధికారులు బతిమాలినా వాటిని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆ డబ్బులు తనకు మోదీ వేశారని, వెనక్కి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడంతో బ్యాంకు అధికారులు విస్తుపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles