Uddhav Thackeray refers to Union minister as future colleague సీఎం ‘భవిష్యత్ స్నేహితుడు’ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్

Uddhav thackeray s future friend remark for bjp leader reignites buzz

Future Friend, Rao saheb Danve, Reignites, Remark, reunion buzz, Uddhav Thackeray, Shiv Sena, BJP, Congress, NCP, Sharad pawar, Devendra Fadnavis, Maharashtra, Politics

Maharashtra Chief Minister Uddhav Thackeray's comment at an event got him laughs but also set speculation on fire, with many state politicians wondering if he was dropping a big hint. Uddhav Thackeray referred to Union Minister and senior BJP leader Raosaheb Danve as “my former friend - and if we come together again, then future friend”.

మహారాష్ట్ర సీఎం ‘భవిష్యత్ స్నేహితుడు’ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ

Posted: 09/17/2021 07:16 PM IST
Uddhav thackeray s future friend remark for bjp leader reignites buzz

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా చేసిన వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీకి చెందిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి రావుసాహెబ్ దన్వేతో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ మాట్లాడుతూ.. ‘బీజేపీ, శివసేన తిరిగి కలిస్తే ఇక్కడ ఉన్న నా మాజీ స్నేహితుడు, భవిష్యత్‌ స్నేహితుడు అవుతారు’ అని అన్నారు. దీంతో శివసేన తిరిగి బీజేపీతో జతకట్టబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే అనంతరం ఉద్ధవ్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన పాత స్నేహితుడు రావుసాహెబ్ దన్వేను చాలా కాలం తర్వాత కలిసిన నేపథ్యంలో ఈ మేరకు జోక్‌ చేసినట్లు చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ దీనిపై స్పందించారు. ఇరు పార్టీల కలయికపై మౌనం వహించాల్సిన అవసరం లేదన్నారు. ‘రాజకీయాల్లో, ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఉద్ధవ్‌ జీ మా ‘మన్ కీ బాత్’ గురించి మాట్లాడారు. ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.

కాగా, కాంగ్రెస్ నేత నానా పటోలే దీనిపై మరోలా స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ కొన్నిసార్లు జోక్ వేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఆయన అదే చేశారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిని పూర్తి చేస్తుంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్య లేదు’ అని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని పటోలే గతంలో చేసిన వ్యాఖ్యలు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి కొనసాగడంపై అనుమానాలు రేకెత్తించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles