HC refuses to modify courts order on Ganesh immersion గణేశ్ నిమజ్జనాల రివ్యూ పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు

Telangana hc dismisses ghmc plea seeking relaxations in pop idol immersion diktat

Ganesh Maharaj, god vinayaka, Ganapati bappa idol immersion, lord Ganesha Nimmajanam, Telangana High Court, PoP ganesha idol immersion, GHMC, Hyderabad police, Hussainsagar lake, GHMC ponds, Hyderabad, Telangana

The division bench comprising Acting Chief Justice MS Ramachandra Rao and Justice T Vinod Kumar on Monday dismissed the lunch motion petition filed by GHMC commissioner seeking relaxations in court order regarding the immersion of Plaster of Paris (PoP) Ganesha idols in Hyderabad's Hussainsagar lake or any other water bodies.

జీహెచ్ఎంసీ గణేశ్ నిమజ్జనాల రివ్యూ పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు

Posted: 09/13/2021 05:59 PM IST
Telangana hc dismisses ghmc plea seeking relaxations in pop idol immersion diktat

వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతుల విగ్రహాల నిమజ్జన విషయమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తిరస్కరించింది. నిమజ్జన ఏర్పాట్లు విషయంలో గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు పాటించకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపింది.

కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్‌ఎంసీ.. అనుమతి కోరుతూ రివ్యూ పిటీషన్ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. గణేష్‌ నిమ్మజ్జనంపై ఏ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలతో ట్యాంకుబండ్ కాలుష్యకాసారంగా మారుతుందని ఇప్పటికే ప్రజాసంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని మర్చిపోయారా.? అని న్యాయస్థానం జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిస్థితి కుడిదిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది.

కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్‌ సాగర్‌, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌  విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్ లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్ సాగర్లో రబ్బర్‌ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ తన పిటీషన్లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles