Sai Dharam Injured with accident at Madhapur రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు గాయాలు..

Actor sai dharam tej shifted to apollo hospital after met with accident

sai dharma tej, Accident, cable bridge, Madhapur, republic, jagapathi babu, deva katta, apollo hospitals, Medicover, Pawan Kalyan, Vaishnav Tej, Varun Tej, Niharika Konidela, Allu Aravind, Tollywood, crime

Actor Sai Dharam met with a bike accident in Hyderabad near cable bridge and is now recovering. Official sources revealed that he is not in danger and is under precautionary care at Apollo hospitals.

రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు గాయాలు.. కొలుకుంటున్నాడన్న వైద్యులు

Posted: 09/11/2021 01:13 AM IST
Actor sai dharam tej shifted to apollo hospital after met with accident

ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో ఐకియా స్పోర్ట్స్‌ బైక్ పై వెళ్తుండగా ఆయన బైక్ అదుపుతప్పింది. దీంతో ఆయన బైక్ పైనుంచి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి గురికాగానే.. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని మెగా హీరోను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. షాక్ తో అపస్మారక స్థితిలోకి జారుకున్న ధరమ్‌ తేజ్‌ను మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే మెడికవర్ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స తరువాత సృహలోకి వచ్చిన ధరమ్ తేజ్ ను అపోలో అసుపత్రకి తరలించారు. ప్ర‌స్తుతం మెగాహీరోకు అపోలోలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తూ.. ఆయన అరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ధరమ్ తేజకు ప్రమాదం జరిగిందన్న వార్తను తెలియగానే మెడికవర్ అసుపత్రికి మెగాస్టార్ చిరంజీవి, హీరో వరుణ్ తేజ్, జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, సహా పలువురు మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు సినీఅగ్రనిర్మాత అల్లు అరవింద్ కూడా చేరుకుని ధరమ్ తేజ్ అరోగ్యం విషయమై అసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ సేఫ్‌గా ఉన్నట్లు టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సాయి ధరమ్‌కు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు. అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. తాను డాక్టర్లతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సాయి ధరమ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం చికిత్సను అందిస్తున్నదని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles