Over 60 drowned as 2 Boats Collide in Brahmaputra బ్రహ్మపుత్ర నదిలో ఢీకొన్న పడవలు.. 100 మంది గల్లంతు..

Dozens feared missing as two passenger ferries collide on brahmaputra in assam

two boats collided, brahmaputra river, Nimati Ghat, Jorhat, amit shah, himata biswa sarma, NDRF teams, rescue operations, Assam, Crime

One person has died and several are feared missing after two passenger boats collided in the Brahmaputra River in Assam's Jorhat. The boats crashed into each other at Nimati Ghat in Jorhat, around 350 km from Guwahati, with at least a 100 passengers onboard.

బ్రహ్మపుత్ర నదిలో ఢీకొన్న పడవలు.. 100 మంది గల్లంతు..

Posted: 09/08/2021 09:32 PM IST
Dozens feared missing as two passenger ferries collide on brahmaputra in assam

అసోంలో ఘోర సంఘటన జరిగింది. పడవలను నడిపించేవారి నిర్లక్ష్యం కారణంగా వంద మందికి పైగా ప్రయాణికులు నదిలో గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి.

ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌- ఎస్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles