Missing toddler found on day four in Australia లిటిల్ సర్వైవర్: అడవిలో ఒంటిరిగా మూడేళ్ల చిన్నారి.. 4వ రోజు..

Missing toddler aj found alive on day four of search in hunter

little survivor in Putty, little survivor in Hunter, little survivor in New south wales, little survivor in Australia, little survivor saved from forest, little survivor's four days in forest, Toddler, Putty, Hunter Region, forest, Little Survivor, Anthony "AJ" Elfalak, PolAir, creek bed, New South Wales, Australia, trending, video, viral video

A toddler who has been missing in the New South Wales Hunter Region for four days has been found alive, with family celebrating in emotional scenes on their rural property. Police said three-year-old Anthony "AJ" Elfalak was located shortly before 12pm, several kilometres from his home in Putty. PolAir spotted AJ in a creek bed, drinking water from it.

ITEMVIDEOS: లిటిల్ సర్వైవర్: తప్పిపోయి అడవిలోకి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. 4వ రోజు..

Posted: 09/07/2021 06:44 PM IST
Missing toddler aj found alive on day four of search in hunter

అర్థారాత్రి వేళ ఒంటరిగా విశాలమైన రోడ్లపై.. ధగధగలాడే వీధి దీపాల కాంతుల నడుమ ఒంటరిగా వెళ్లాలంటేనే భయంతో కంపించే యువత ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది అడవుల్లో ఎలాంటి వెలుతురు లేకుండా.. అకలి తీరే మార్గం లేకపోయినా.. మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు గడపడం అంటే మామూలు విషయం కాదు. ఇదెవరో యువతో, లేక యువకుడో చేశారనుకుంటే అదీ పోరబాటే. ఓ మూడేళ్ల చిన్నారి.. దారితప్పి అడవుల్లో మూడు రాత్రులు గడిపాడు. నాలుగో రోజున పోలీసులు అడవిలో చిన్నారిని గుర్తించి తల్లి చెంతకు చేర్చారు.

మూడేళ్ల బాలుడు అడవిలో తప్పిపోయాడు. మూడు రోజులు అయినా అ చిన్నారి జాడ క‌నిపించ‌లేదు. ఇక నాలుగో రోజున తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా వుండాలని తల్లిదండ్రులు, చిన్నారి తోడబుట్టినవారితో పాటు విషయం తెలిసిన స్థానికులు, వారి బంధువర్గాలు అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే మూడు రోజులుగా చిన్నారి అచూకి తెలియకపోవడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాని పోలీసులు.. చిన్నారి త‌ల్లిదండ్రుల‌కు ధైర్యం చెప్పారు. చిన్నారిపైన ఆశ‌లు వ‌దిలేసుకోవాల‌ని చెప్పారు. క్రూర మృగాలు సంచరించే అడవిలో.. కష్టమని నిట్టూర్పారు పోలీసులు.

అయితే తల్లికి మాత్రం తన కుమారుడికి ఏమీ కాదని, వాడు సురక్షితంగానే వున్నాడని, కాపాడాలని పోలీసులను కోరింది. దీంతో చివరి ప్రయత్నంగా వారు హెలికాప్టర్ ద్వారా అన్వేషణ చేపట్టారు. అంతే.. అంద‌రినీ షాక్‌కు గురిచేస్తూ.. అడ‌విలో మూడు రోజుల పాటు మూడేళ్ల చిన్నారి ఒంటరిగా సంచరిస్తూ.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రావిన్సు పరిధిలోని హంటర్ రీజియన్ లో చోటు చేసుకుంది.

ఆంటోనీ ఏజే ఎలఫాలక్ అనే బాలుడు.. సిడ్నీ నుంచి 140 కిలోమీట‌ర్ల దూరం ఉన్న త‌న ఫ్యామిలీ కాటేజ్ నుంచి మిస్ అయ్యాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన రెస్క్యూ టీమ్.. అక్క‌డికి ద‌గ్గ‌ర్లో ఉన్న అడ‌విలో గాలించడం స్టార్ట్ చేసింది. ఆ బాలుడికి ఆటిజం అనే స‌మ‌స్య కూడా ఉండ‌టంతో.. ఆ బాలుడిని త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌న్న ఉద్దేశంతో.. పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ.. ఆ బాలుడి ఆచూకీ మాత్రం దొర‌క‌లేదు. మూడు రోజుల పాటు.. అడ‌వి అంతా గాలించారు. అయినా క‌నిపించ‌లేదు. దీంతో అంద‌రూ ఆ బాలుడి మీద ఆశ‌లు వ‌దిలేశారు. కానీ.. చివ‌రి అస్త్రంగా హెలికాప్ట‌ర్‌లో రెస్క్యూ టీమ్ సెర్చ్ చేసింది.

ఇలా వారు వెతుకుతుండ‌గా.. ఓ నీళ్ల గుంట‌లోకి దిగి.. ఆ నీళ్ల‌తో ఆడుకుంటున్న బాలుడిని టీమ్ గుర్తించింది. ఆ బాలుడిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. మూడు రోజులు, మూడు రాత్రులు ఒంట‌రిగా అడ‌విలో ఉండి.. బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌టం అనే మిరాకిల్ అంటూ అక్క‌డి స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ బాలుడి శ‌రీరం మీద చిన్న చిన్న గాయాలు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. బాలుడిని హెలికాప్ట‌ర్ నుంచి బైనాక్యుల‌ర్ ద్వారా గుర్తించిన వీడియోను రెస్క్యూ టీమ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇలాగే.. గతంలో 72 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా అడ‌విలో వ‌ర్ష‌పు నీళ్ల‌ను తాగుతూ 3 రోజులు అడ‌విలోనే ఉండి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles