"Panj Pyare": Harish Rawat Wipes Shoes At Gurdwara ‘‘పంచ్ ప్యారే’’ ప్రాయశ్చిత్తం: బూట్లు తుడిచిన మాజీ సీఎం

Harish rawat fulfils promise of penance cleans shoes sweeps floor at gurdwara

Congress leader Harish Rawat, Harish rawat cleans shoes sweeps floor, Harish Rawat Panj Pyare remark. Harish rawat, former CM, congress, Navjoth singh sidhu, panj pyare remark, gurudwara, cleaning shoes, sweeping floor, Gurudwara, Uttarakhand, Politics

Congress leader Harish Rawat was seen cleaning shoes and sweeping the floor at a gurdwara today as part of his promised "penance" for recently comparing Navjot Sidhu and his team to "Panj Pyare", a term of reverence for Sikhs.

ITEMVIDEOS: ‘‘పంచ్ ప్యారే’’ వ్యాఖ్యపై ప్రాయశ్చిత్తం: బూట్లు తుడిచిన మాజీ సీఎం

Posted: 09/04/2021 12:40 PM IST
Harish rawat fulfils promise of penance cleans shoes sweeps floor at gurdwara

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీశ్ రావత్ పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తంతో తుడిచేసుకున్నారు, ఓ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడవడం, ప్రార్థనా మందిరాన్ని చీపురుతో శుభ్రపరచడం ద్వారా గతంలో తాను చేసిన వ్యాఖ్యల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. గతవారం పంజాబ్ లోని చండీగఢ్‌లో పర్యటించిన హరీశ్ రావత్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సహా ఐదుగురు నేతలను ఉద్దేశించి సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. ఈ పదం ఉపయోగించిన హరీశ్ రావత్ సిక్కుల మనోభావాలను దెబ్బతీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన రావత్ క్షమాపణ చెప్పారు. అంతేకాక, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే  ఉత్తరాఖండ్‌, ఉదంసింగ్ నగర్ లోని నానక్ మిట్టలో ఉన్న గురుద్వారాను సందర్శించి భక్తుల బూట్లు తుడిచి, మందిర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట్లో వేరల్ గా మారగా.. ఔరా.. రాజకీయ నాయకులు కూడా అన్నమాటపై నిలబడతారా..? చెప్పినట్టుగానే చేస్తారా.. అంటే కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles