Boy strangles father after he scolds him ఆన్ లైన్ గేమ్ ఎంతపని చేసింది.. తండ్రిని చంపిన మైనర్ బాలుడు

Boy strangles father after he scolds him for playing mobile games in surat

minor boy strangled his father, online games son father, minor boy juvenile home, Online Games, Surat murder, boy strangulates father, mobile games, Ichhapore police station, Surat, Ahmedabad, Gujarat, Crime

A shocking incident has been reported from Surat district from Gujarat where a 17-year-old boy allegedly strangled his father after he scolded him for playing games on mobile. Police said they have detained the boy and sent him to juvenile home.

ఆన్ లైన్ గేమ్ ఎంతపని చేసింది.. తండ్రిని చంపిన మైనర్ బాలుడు

Posted: 09/04/2021 10:52 AM IST
Boy strangles father after he scolds him for playing mobile games in surat

ఆన్ లైన్ గేమ్ ఆడితే పిల్లల మనత్వత్వంపై తీవ్రప్రభావం పడుతుందని ఇప్పటికే ప్రముఖ సైకాలజిస్టులు చెబుతున్నారు. వారిలో నేరప్రవృత్తిని పెంచడంతో పాటు.. మానసికంగా కూడా ప్రభావితుల్ని చేస్తుందని చెబుతున్నారు. అయినా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లను కొనిచ్చి.. గేమ్స్ ఆడనిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆన్ లైన్ గేమ్లను అత్యధికంగా మార్కెట్ చేసిన చైనా లాంటి దేశాలే ఇప్పుడు చిన్నారుల ఆన్ లైన్ గేమ్ లను నియంత్రిస్తూ కొత్త విధివిధానాలను తీసుకువస్తున్నాయి. వారానికి కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ కోసం కేటాయించాలే తప్ప అంతకుమించితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే మన దేశంలో మాత్రం చిన్నారులకు ఇలాంటి అంక్షలేమీ అమలు కావడం లేదు.

దీంతో ఆ గేమ్ ఎంతపని చేసిందో తెలుసా..? నిత్యం అన్ లైన్ గేమ్ అడుతున్నాడని ఓ తండ్రి తన కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేయండంతో.. ఆ నిండు కుటుంబం విషాదాదంలోకి నెట్టివేయపడింది. తల్లిని ఒంటరిని చేసింది. తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లగా, కొడుకు మాత్రం చిన్నవయస్సులోనే కారాగారవాసం చవిచూసేలా చేసింది. గంట ముందువరకు సంతోషంగా వున్న కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మొబైల్‌ ఫో‌న్‌లో గేమ్‌ ఆడటంపై తండ్రి తిట్టడంపై ఆ కోడుకు తన తండ్రి గొంతు నొక్కి హత్య చేశాడు. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన పలువురు తల్లిదండ్రులతో పాటు ఆన్ లైన్ గేమ్ అడే చిన్నారులను కూడా అలోచనలో పడేసింది.

అసలేం జరిగిందంటే.. ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్‌లోని న్యూ సివిల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడని ఆరా తీశారు. బాత్ రూమ్‌లో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తి మృతదేహానికి గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతునొక్కడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా 17 ఏండ్ల బాలుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొబైల్‌లో గేమ్‌ ఆడుతున్న తనని తండ్రి తిట్టాడని, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిపాడు. తాను గొంతునొక్కడంతో తన తండ్రి చనిపోయినట్లు చెప్పాడు. దీంతో బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ హోమ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles