Consult all on monetization pipeline: P Chidambaram ప్రభుత్వ అస్తుల ద్రవ్యీకరణ.. పట్టపగలు దోపిడీనే: చిదంబరం

Congress only sold non core assets modi govt selling everything says chidambaram

Chidambaram, Narendra Modi, Nirmala Sitaraman, privatisation, National Monetisation Pipeline (NMP), monetisation policy, Finance Minister, National, Politics

Former Union finance minister P Chidambaram on Friday slammed the Centre’s National Monetisation Pipeline (NMP), stating that the Narendra Modi-led government was planning to sell state assets in the name of the monetisation policy. He further said that the Congress, when it was in power, only monetised non-core, loss-making assets.

ప్రభుత్వ అస్తుల ద్రవ్యీకరణ.. పట్టపగలు దోపిడీనే: చిదంబరం

Posted: 09/04/2021 10:02 AM IST
Congress only sold non core assets modi govt selling everything says chidambaram

ప్ర‌భుత్వ ఆస్తుల ద్రవ్యీక‌ర‌ణ విధానం ప‌ట్ల ప్రధాని నరేంద్రమోదీ సార‌ధ్యంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబ‌రం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జాతీయ మానెటైజేష‌న్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) స్కీమ్ ను ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడీగా చిదంబ‌రం అభివ‌ర్ణించారు. దేశం అర్థిక స్వాలంభన సాధించేందుకు గడిచిన 70 ఏళ్ల కాలంలో అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ప్రభుత్వ ఆస్తుల‌ను కేంద్రం అమ్మ‌కానికి పెడుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆస్తుల విలువ‌తో పోలిస్తే వాటి అమ్మ‌కం ద్వారా వ‌చ్చే మొత్తం స్వ‌ల్ప‌మ‌ని ఆయన విమర్శించారు.

కేవ‌లం కొన్ని కోట్ల రూపాయ‌ల కోసం 70 ఏండ్లుగా సృష్టించిన ఆస్తుల‌ను తెగ‌న‌మ్మ‌డం స‌రికాద‌ని అన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ 1.3 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆస్తుల‌ను రూ 1.5 ల‌క్ష‌ల కోట్ల‌కు ఆర్ధిక మంత్రి విక్ర‌యిస్తే దానిపై వ‌చ్చే రాబ‌డి ఎంత‌ని ప్ర‌శ్నించారు. రూ 20,000 కోట్ల అద‌న‌పు రాబ‌డి కోసం ఏండ్ల త‌ర‌బ‌డి స‌మీక‌రించిన ఆస్తుల‌ను అమ్ముతారా అని చిదంబ‌రం నిల‌దీశారు. ఇది భారీ కుంభ‌కోణం, ప‌ట్ట‌ప‌గ‌లు చేసే దోపిడీ కాక మ‌రేంట‌ని ప్ర‌శ్నించారు. ఇది కేవలం ప్రభుత్వ అస్తులు కావని.. దేశంలోని ప్రతీ పౌరుడి వారసత్వ కష్టార్జితం అన్నారు. తమ తాతలు, తండ్రులు చోమటోడ్చి ప్రభుత్వానికి చెల్లించిన ప్రతి రూపాయితోనే గత ప్రభుత్వాలు ప్రభుత్వానికి ఈ ఆస్తులను సమీకరించాయని ఆయన స్పష్టం చేశారు.

ఇందులో మోడీ మార్కు ప్రభుత్వ కుట్ర కూడా దాగివుందని చిదంబరం అన్నారు. గత ప్రభుత్వాలు గడిచిన 70 ఏండ్లలో ఏం సాదించాయని అడుగుతున్న మోడీకి.. వారు దేశానికి సంపాదించి పెట్టిన ఆస్తులను ద్రవ్యీకరణ చేయడం ద్వారా వారి గుర్తులను కూడా నామరూపాలు లేకుండా చేసే కుట్రదాగి వుందని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వం వ‌ద్ద భారీగా ఆస్తులున్నాయ‌ని, వాటిని ప్ర‌భుత్వం సొమ్ము చేసుకుని వ‌న‌రుల‌ను స‌మీక‌రిస్తే వాటిని నూత‌న మౌలిక ప్రాజెక్టుల‌పై ఖ‌ర్చు చేయ‌డం, అణ‌గారిన వ‌ర్గాల సంక్షేమానికి వెచ్చించేందుకు వెసులుబాటు ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ ముఖ్య ఆర్ధిక స‌ల‌హాదారు సంజీవ్ స‌న్యాల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles