తాలిబన్లు మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ ను తమ ఆధీనంలోకి తీసుకునే తరుణంలో చేసిన వ్యాఖ్యలకు.. అధికారాన్ని చేపట్టబోతున్న తరుణంలో చెబుతున్న మాటలకు మధ్య వ్యత్యాసం కొట్టేచ్చినట్టుగా కనబడుతోంది. కాశ్మీర్ అంశాన్ని తాము భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యగా చూస్తామని ఇటీవల చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని ఇప్పుడు తాజాగా మరో గళాన్ని వినిపిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ ల ద్వైపాక్షిక అంశం అని చేసిన వ్యాఖ్యలు కాస్తా.. హక్కుగా మార్చేశాయి. రేవు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడ మల్లన్న అన్న చందంగా తాలిబన్లు మాటమార్చారు.
కాశ్మీర్ అంశాన్ని సరిహద్దు అంశంగానే పరిగణించిన తాలిబన్లు.. అధికారం చేపట్టబోతున్న తరుణంలో మాత్రం ఈ అంశాన్ని ముస్లిమ్.. ముస్లిమేతర సమస్యగా చూడటం గమనార్హం. కాశ్మీర్ లోని ముస్లింల గురించి మాట్లాడే హక్కు తమకుందని అనడం గమనార్హం. కాశ్మీర్ విషయంలో తాలిబన్ల సాయం తీసుకుంటామని గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ నేతలు చెప్పినట్టు గానే తాలిబన్లు కూడా మాటమార్చారు. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ హక్కు మాకుంది. ముస్లింలుగా కశ్మీర్, ఇండియా సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అని షహీన్ అన్నాడు.
అయితే ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్టబోమని కూడా అతను స్పష్టం చేశాడు. ముస్లింలు మీ సొంత మనుషులు, మీ దేశ పౌరులు. మీ చట్టాల ప్రకారం వాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలని మేము గళమెత్తుతాం అని షహీన్ చెప్పాడు. ఆఫ్ఘన్ భూభాగం ఇండియా వ్యతిరేక ఉగ్రవాద శక్తుల అడ్డాగా మారకూడదని ఈ మధ్య తాలిబన్లతో చర్చల సందర్భంగా భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఖతార్‌లో ఇండియా రాయబారి దీపిక్ మిట్టల్ తాలిబన్ నేత షేర్ మహ్మద్‌ను కలిసి ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి కశ్మీర్‌పై ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more