ఆ ఇంట్లోని దంపతులు బయటకు వెళ్లి తమ పని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కాసింత బిజీ షెడ్యూల్ మధ్య గడిపారో లేక ఉదయం నుంచి పనులతో బిజీగా వున్నారో కానీ.. మొత్తానికి ఇంటికి చేరుకోగానే ఇద్దరూ సోఫాలో కూర్చోని విశ్రాంతి తీసుకుంటున్నారు. అలా తల మాత్రం సోఫాపై పెట్టి రెండు చేతులను సోఫాపై వాల్చి రిలాక్స్ అయ్యారు. అంతే.. ఇంతలో ఇంట్లోని ఓ దృశ్యం వారిద్దరి దృష్టిని ఆకర్షించింది. అది చూసిన వారిద్దరూ భయపడ్డారు. ఏదో హారర్ చిత్రంలోని సీన్ తరహాలోనే వారింట్లోని ఓ మూలన సీలింగ్ కు ఆనుకుని జుట్టు కనిపించింది. అది గాల్లో వేలాడుతుంది. ఇది చూసిన వారు భాయానికి గురయ్యారు. అయితే వెంటనే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అది ఏమైవుంటుందా అని ఆలోచించారు.
అసలా జుట్టు ఎవరిది అన్న విషయం వారికి అసలు తోచలేదు. జుట్టు సీలింగ్ పైకి ఎలా చేరిందా అంటూ అనుమానంతో అడుగులో అడుగేస్తూ ఇద్దరూ కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని అక్కడ ఏముందో చూడటానికి పై అంతస్తుకు చేరుకున్నారు. ఇక అక్కడ చూడగానే తమ కూతురు కాళ్లు పైకి, తల కిందకీ చేసివుంది. వారికి అసలేం అర్థం కాలేదు. దీంతో అమెను లాగేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి, వెంటనే అగ్నిమాపక దళాల బృందానికి ఫోన్ చేసిన వారు వారి వచ్చిన తరువాత సీలింగ్ కు కొంత దూరంలో ఢ్రిల్లింగ్ మిషీన్ తో రంధ్రం చేసి జట్టునే కాదు అక్కడున్న రంద్రంలోకి తలను దూర్చిన వారి కూతుర్ని కూడా సురక్షితంగా బయటకు తీశారు.
అసలేం జరిగిందంటే.. నైరుతి చైనా పరిధిలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని పుడింగ్ కౌంటీలో నివసిస్తున్న ఓ చిన్నారి.. ఆట ఆడుకుంటూ పైఅంతస్తులో ఉన్న చిన్న రంధ్రంలోకి తన తలను దూర్చుతుంది. ఇక బయటికి తీయాలని ట్రై చేయగా.. అది కాస్తా అందులో ఇరుక్కుపోతుంది. తద్వారా అప్పుడే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ చిన్నారి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇస్తుంది. ఆ రంధ్రాన్ని ఫ్యాన్ పెట్టేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి తలను అందులో నుంచి తీసేందుకు పేరెంట్స్ శతవిధాల ప్రయత్నించారు. ఆ రంధ్రంలో నుంచి తీస్తున్న ప్రతీసారి చిన్నారి నొప్పితో విలవిలలాడిపోయేది.
దీనితో తమ కూతురు తలను బయటికి తీసేందుకు ఆ తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తలక్రిందులుగా ఆ అమ్మాయి రంధ్రంలో ఇరుక్కుపోయినట్లు గుర్తించిన సిబ్బంది.. 40 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి అతి జాగ్రత్తగా బయటికి తీశారు. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని చూస్తే ఓ హారర్ సినిమాలా అనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more