China cuts children's online gaming to one hour చైనాలో వారినికి మూడు గంటలే ఆన్ లైన్ గే్మ్స్..!

China cuts minors time on online games to three hours per week

online gaming china, china online gaming ban, online gaming, china minor gaming, tencent, netease, students, children, working days, Holidays, sundays

Chinese regulators on Monday slashed the amount of time players under the age of 18 can spend on online games to an hour of gameplay on Fridays, weekends and holidays, in response to growing concern over gaming addiction, state media reported.

చైనాలో కొత్త నిబంధనలు.. వారినికి మూడు గంటలే ఆన్ లైన్ గే్మ్స్..!

Posted: 09/01/2021 07:45 PM IST
China cuts minors time on online games to three hours per week

ఆన్ లైన్‌ గేమ్స్‌ ఆడే విషయంలో చైనా కఠిన నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు స్కూల్‌ నడిచే రోజుల్లో ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఆడటంపై నిషేధం విధించింది. వారాంతాలు లేదా సెలవు దినాల్లో మాత్రమే వీడియో గేమ్స్‌ ఆడేందుకు అవకాశం కల్పించింది. అది కూడా రోజులో గంట సమయం మించకూడదన్న కఠిన నిబంధనలను చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నియమాలు ఇవాల్టి నుంచే అమలులోకి రానున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌తో విద్యార్థుల ఆరోగ్యంతోపాటు చదువు కూడా చెడిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ఈ నిబంధనలు 18 ఏండ్లలోపు వయసున్న వారికి మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది.

ఈ నిబంధనలతో చిన్నారులు వారాంతాల్లో మూడు గంటల కన్నా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌పై గడపడానికి ఇకపై వీలు లేదు. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బిజీగా ఉండటం వల్ల విలువైన చదువును, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేయడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఉత్తర్వుల ప్రకారం సాధారణ రోజుల్లో గంటన్నర పాటు వీడియో గేమ్స్‌ ఆడేందుకు అవకాశం ఇచ్చేవారు. అలాగే, వారాంతాల్లో రోజుకు మూడు గంటల చొప్పున అనుమతించేవారు. ఈ నియమాలు మరీ సరళంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదుతో ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

ఈ రూల్స్ ప్రకారం విద్యార్థులు శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుకోవచ్చు. చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు ప్రపంచ గేమింగ్ మార్కెట్‌కు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. చైనాలో ఆన్‌లైన్ గేమింగ్‌లో లక్షలాది మంది యువకులు పాల్గొంటున్నారు. గేమ్ డెవలపర్లు చైనాను ఒక ముఖ్యమైన మార్కెట్‌గా భావిస్తారు. స్టాటిస్టా ప్రకారం, చైనా ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ విలువ రూ.4.27 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రభుత్వ కఠిన నిర్ణయం తర్వాత కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles