TTD introduced srivari dhana prasadam శ్రీవారి భక్తులకు అందుబాటులోకి 'ధన ప్రసాదం'..

Tirumala tirupati devasthanams introduced srivari dhana prasadam

Tirumala Tirupati Devasthanam, TTD, SriVari dhana Prasadam, Tirumala dhana Prasadam, exchange of coins with notes, YV SubbaReddy, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vada Prasadam, Kalyanam Laddu Prasadam, recommendation letters, SriVari dhana Prasadam, Dharma reddy, devotional

With the State government permission the Tirumala Turupati Devasthanam Boad has decided and introduced an new prasadam to SriVari devotees t.e Dhana Prasadam commencing from September 1. By which the Devasthanam board exchanges the coins in to currency notes.

టీటీడీ కొత్త నిర్ణయం: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి 'ధన ప్రసాదం'..

Posted: 09/01/2021 05:11 PM IST
Tirumala tirupati devasthanams introduced srivari dhana prasadam

నిత్యం శ్రీవారి భక్తులకు పలు సేవలను తీసుకువచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే శ్రీవారి భక్తుల కోసం తీసుకువచ్చే కార్యక్రమాలకు బదులు తమ ఖజానాలో అధికభాగం నిండిపోయిన నాణేలాను భక్తులకు అందించే తమ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అదే శ్రీవారి ధన ప్రసాదం. ఈ కార్యక్రమం ద్వారా అటు టీటీడీకి లబ్ది చేకూరడంతో పాటు ఇటు భక్తులకు కూడా చిల్లర నాణేలు చేతిలో అందుబాటులో వుండే ఉభయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది.

శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిరోజు స్వామివారి హుండీలో రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు వస్తుంటాయి. ఈ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరగిపోయాయి. అందుకే ఈ నాణేలను నోట్లుగా మార్చుకునేందుకు టీటీడీ ధన ప్రసాదం కార్యాక్రమాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో అతిథిగృహాల రిసెప్షన్ కేంద్రాల వద్ద ధన ప్రసాదం రూపంలో నాణేలను 100 రూపాయల పాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.

అకామడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి తెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా ఇవ్వబోతోంది. ఒకవేళ చిల్లర తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు. కవర్లో కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. కవర్ లోపల వంద రూపాయి కాయిన్స్ ఉంటాయి.  వందరూపాయలు చెల్లించి ఆ ధనప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్ ప్రసాదం తీసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles